Kadapa Court : షర్మిల, సునీతలకు జరిమానా విధించిన కోర్టు
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Kadapa court fined Sharmila and Sunitha
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్ చేసిన విషయం తెలిసిందే. సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తూ.. ఈ విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువురి వాదనలు విన్నది. అనంతరం షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారని మందలిస్తూ.. కడప కోర్టు షర్మిల, సునీతలకు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు సూచించింది.
