KA Paul : పవన్‌ను కలిసేందుకు వెళ్లిన పాల్.. కలిశారా? లేదా?
జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan)ను కలవడం కోసం కె.ఎ.పాల్ జనసేన కార్యాలయాని(Janasena Party Office)కి వెళ్లారు. దాదాపు అరగంట పాటు గేట్ బయటే వేచి చూశారు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

KA Paul
జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan)ను కలవడం కోసం కె.ఎ.పాల్ జనసేన కార్యాలయాని(Janasena Party Office)కి వెళ్లారు. దాదాపు అరగంట పాటు గేట్ బయటే వేచి చూశారు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన మాస్టర్ ప్లాన్ వింటే పవన్ తప్పనిసరిగా సీఎం అవుతారని చెప్పారు. పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి రోజూ తనను ఒత్తిడి చేస్తూ ఎలాగైనా సరే తమ బాస్‌ను సీఎం చేయాలని బతిమాలుతున్నారని, అందుకే ఇక్కడికి వచ్చానని పాల్ చెప్పుకొచ్చారు. పవన్‌ను కలిసిన తర్వాతే ఇక్కడి నుంచి తిరిగి వెళతానంటూ కారులోనే భీష్మించుకుని కూర్చున్నారు. తీరా కార్యాలయంలో పవన్ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు.
