గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.

సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ కారణంగా బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేతకు అనుచరుడని తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్ వేధింపుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం తెనాలి రైల్వేస్టేషన్ సమీపంలో గీతాంజలి అనే మహిళ గాయపడిన స్థితిలో కనిపించింది. సోమవారం ఆమె మృతి చెందింది. ఆమె రైలు ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుందని లోకో పైలట్ తెలిపారు. ఆమె శరీరమంతా అనేక గాయాలు కనిపించాయి. గుంటూరు GGH లో చేరిన ఆమె సోమవారం చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆమె మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గీతాంజలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూట్యూబ్ ఛానెల్‌లో గీతాంజలి ఇంటర్వ్యూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గీతాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.

Updated On 14 March 2024 3:08 AM GMT
Yagnik

Yagnik

Next Story