Soumya Shetty : బంగారం చోరీ కేసులో యువనటి సౌమ్యశెట్టి అరెస్ట్..!
విశాఖలో జరిగిన దొంగతనం కేసులో సినీ నటి సౌమ్యశెట్టిని(Soumya Shetty) పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో(Dondaparthi Balaji Residency) జరిగిన చోరీ కేసులో యువ నటి సౌమ్యశెట్టి నిందితురాలిగా తేలింది.

Soumya Shetty
విశాఖలో జరిగిన దొంగతనం కేసులో సినీ నటి సౌమ్యశెట్టిని(Soumya Shetty) పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపర్తి బాలాజీ రెసిడెన్సీలో(Dondaparthi Balaji Residency) జరిగిన చోరీ కేసులో యువ నటి సౌమ్యశెట్టి నిందితురాలిగా తేలింది. పెందుర్తికి చెందిన సౌమ్యశెట్టికి ప్రసాద్ అనే వ్యక్తి కూతురితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే గత నెల 2న ప్రసాద్ ఇంటికి సౌమ్యశెట్టి వచ్చింది. బీరువాలో ఉన్న బంగారం అంతా సౌమ్యశెట్టి ఎత్తుకెళ్లింది. ఫిబ్రవరి 23న బాధితుడు ప్రసాద్ బీరువా తెరిచి చూడగా అందులో ఉన్న 74 తులాల బంగారం కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సౌమ్యశెట్టి బంగారాన్ని చోరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చోరీ చేసిన తర్వాత బంగారాన్ని తీసుకొని నటి గోవా వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు సినిమాల్లో సౌమ్యశెట్టి నటించింది.
