Former Judge Lakshmi Narayana : వైసీపీ నుంచి పోటీ.. స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ(CBI) మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Lakshmi Narayana) వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) తరపున పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఊహాగానాలలో ఏమాత్రం నిజం లేదని ఆయన ఖండించారు.

Former Judge Lakshmi Narayana
సీబీఐ(CBI) మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Lakshmi Narayana) వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP) తరపున పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఊహాగానాలలో ఏమాత్రం నిజం లేదని ఆయన ఖండించారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
అయితే.. సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని.. అంగన్వాడీలలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వైసీపీలో చేరనున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
