MLA Pantham Nanaji : జనసేన ఎమ్మెల్యే బూతుల దండకం.. భర్తరఫ్ చేయాలంటూ వైద్య సిబ్బంది నిరసన
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పదవీ అహంకారంతో దౌర్జన్యం చేశారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పదవీ అహంకారంతో దౌర్జన్యం చేశారు. ఎంఎల్ఏ నానాజీ, జనసేన కార్యకర్తలు.. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బూతుల దండకం విప్పి దాడి చేశారు. ఎంఎల్ఏ నానాజీ రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారు. ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు వారికి తెలిపారు.
అయితే.. సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ వచ్చిన అనుమతి ఇస్తామని స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పారు. దీంతో ఎంఎల్ఏ నానాజీకి ఆయన అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆగ్రహంతో ఆర్ఎంసి గ్రౌండ్ కు వచ్చిన ఎమ్మెల్యే పంతం నానాజీ.. స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించారు. బూతుల దండకంతో అధికారిపై విరుచుకుపడ్డారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు మాస్క్ లాగిన ఎంఎల్ఏ ఆయనపై చేయి చేసుకున్నారు. ఎంఎల్ఏతో పాటు ఆయన అనుచరులు కూడా భయానక వాతావరణం సృష్టించారు. ఎమ్మెల్యే దాడిపై రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. వైద్య సిబ్బంది అందరూ ఎమ్మెల్యే తీరును వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారు. నానాజీని ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తుంది.