ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించడంపై తెలుగు చిత్ర పరిశ్రమకు

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించడంపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు.. టీడీపీ అధినేత చంద్రబాబులను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

"ప్రియమైన Nara Chandrababu Naidu మామయ్యకు చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు... మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన Nara Lokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన Nandamuri Balakrishna , MP గా గెలిచిన భరత్, దగ్గుబాటి పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు." అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్టులు పెట్టారు.

సీనియర్ హీరోగా నాగార్జున కూడా ఎక్స్ లో స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాలు సాధించిన చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు అభినందనలు. మీపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

Updated On 5 Jun 2024 4:39 AM GMT
Yagnik

Yagnik

Next Story