Jr.NTR Vs Chandra Babu : ఎవరు దూరం పెట్టారా.. ఎవరు దూరం జరిగారు..!
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ దూరంగా ఉన్నారు.. కుటుంబం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నా తారక్ మాత్రం రాలేనని తేల్చి చెప్పేశారు. దీనితో పార్టీకి, కుటుంబసభ్యులను జూనియర్ దూరంపెట్టినట్టు క్లియర్ అయింది. అయితే చంద్రబాబు కూడా తారక్ ని పార్టీలోకి రావాలని ఆహ్వానించలేదు. అంతే కాకుండా మేనత్త భువనేశ్వరిపై వైసీపీ(YCP) చేసిన వ్యాఖ్యలను ఖండించడంలో కూడా ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరును చాలామంది తప్పు పట్టారు.. ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఎవరిని దూరం పెట్టారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
జూ.ఎన్టీఆర్(Jr.NTR) ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు. సినిమాల నుంచి రాజకీయాలవరకు అయన పెను సంచలనం. తాతకి తగ్గ తనయుడిలా అయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినిమాల్లో అగ్ర కదనాయకుడిలా కొనసాగుతున్నారు.
సినిమాల్లో తారక్ కు తిరుగు లేదు.. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అన్ని చేదు అనుభవాలే.. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి(TDP) అయన రథసారధిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నా.. ముఖ్య కారణం చంద్రబాబు(Chandrababu) అని చెబుతున్నారు.. జూనియర్ 2009 ఎన్నికల్లో టీడీపీకి(TDP) ఎన్నికల ప్రచారకర్తగా ఉన్నారు.. పార్టీని గెలిపించాలని అయన ఎంతో కృష్ణి చేసారు.. అయినా పార్టీ విజయం సాధించలేదు. ఆ తరువాత అయన సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. . ఇక తండ్రి హరికృష్ణ మరణం తరువాత ఈ దూరం మరింత పెరిగింది. రాజకీయాల ఊసెత్తితేనే తారక్ మండిపోతున్నారు. టీడీపీకి ఆయనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు.
టీడీపీ ప్రస్తుత్తం వెంటిలేటర్ పై ఉంది.. ఆ పార్టీని బ్రతికించాలంటే యువ రక్తం అవసరం.. అలాంటి యువకుడైన జూనియర్ ను చంద్రబాబు ఎందుకు దూరం పెడుతున్నారు అంటే కొడుకు లోకేష్(Lokesh) కోసమని కొంత మంది వాదన.. లోకేష్ తో పోల్చుకుంటే జూనియర్ ఘనుడు.. అలాంటి వాడు పార్టీలోకివస్తే తన కొడుకు ఎదుగుదలకు అడ్డంకిగా మారతారని చంద్రబాబు భావిస్తున్నట్టు కొంత మంది చెబుతున్నారు.