Journalist YNR : ఇహ ఛానల్ చైర్మన్ వై నరసింహారావుకు భారీ ఊరట
చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగింది అంటూ తన విశ్లేషణలో పేర్కొన్న అంశాలపై కేసు నమోదు చేసిన కూటమి సర్కార్
చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగింది అంటూ తన విశ్లేషణలో పేర్కొన్న అంశాలపై కేసు నమోదు చేసిన కూటమి సర్కార్
గత నెలలో చాగంటి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తనని అవమానపరిచింది అంటూ ఒక వీడియోలో తన భావాలను వ్యక్తపరిచిన కారణంగా ఇది తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తుంది అంటూ తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టిటిడి యాజమాన్యం
డాక్టర్ ఏ వి ఎస్ ఎస్ విభీషణ శర్మ తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన విశ్లేషణ కుల మత ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తుంది అంటూ తన రిపోర్ట్ లో పేర్కొన్న టీటీడీ ఉద్యోగి
టీటీడీ ఉద్యోగి ఇచ్చిన రిపోర్టు మేరకు సెక్షన్ 352 353 ప్రకారం కేసు నమోదు చేసిన ఎస్ యు వి క్యాంపస్ తిరుపతి పోలీసులు
ఈ ఎఫ్ ఐ ఆర్ పై తక్షణమే చర్యలు నిలిపివేయవలసిందిగా హైకోర్టును ఆశ్రయించిన ఇహ ఛానల్ యాజమాన్యం
భావవ్యక్తీకరణలో భాగంగా చేసిన వీడియోలో ఈ విధంగా కేసులు నమోదు చేయటం, కూటమి సర్కారుకు తగదన్న ఛానల్ యాజమాన్యం
వ్యక్తిగతమైన కక్షలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తుందన్న పిటిషనర్
ఒకవేళ తన మాటలతో బాధపడి ఉంటే చాగంటి రిపోర్ట్ ఇవ్వాలి తప్ప తన తరపున తిరుమల ఉద్యోగి రిపోర్టు ఇవ్వటానికి తీవ్రంగా తప్పు పట్టిన పిటిషన్
ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
పిటిషనర్ తరుపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
ప్రాథమిక హక్కుల లో భాగంగా తన భావాన్ని వ్యక్తపరిచిన ఒక ఛానల్ యాజమాన్యంపై కుట్రపూరిత ఎఫ్ఐఆర్ నమోదు చేయటం టిటిడి స్థాయికి తగదన్న పిటిషనర్ న్యాయవాది
పిటిషనర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం
ప్రతివాదికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
పిటిషనర్ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు
సెక్షన్ 41 ఏ నిబంధనలు పాటించాలని పోలీసులు ఆదేశం
విచారణ నాలుగు వారాలకు వాయిదా