మామూలుగా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు, చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest)కు సంబంధం లేదు. అలాగే తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు విడుదలకు సంబంధం లేదు. ఎందుకంటే రెండు వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయాలు.

మామూలుగా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు, చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest)కు సంబంధం లేదు. అలాగే తెలంగాణ ఎన్నికలకు చంద్రబాబు విడుదలకు సంబంధం లేదు. ఎందుకంటే రెండు వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయాలు. చంద్రబాబు అరెస్ట్‌ అన్నది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వ్యవహారం. ఆయన ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత. కానీ చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణకు చెందిన చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ సెంట్రీక్‌గా పలు ఆందోళనలు జరిగాయి.చంద్రబాబు సానుభూతిపరులంతా కలిసి గచ్చిబౌలి స్టేడియంలో ఓ పెద్ద కార్యక్రమాన్నే నిర్వహించారు. తెలంగాణలో ఉన్న సెటిలర్లలో ఓ వర్గం అంతా బీఆర్‌ఎస్‌ పట్ల కోపంగా ఉన్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌కు ఓటేసేది లేదని భీష్మించుకున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల కేటీఆర్‌ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్‌ అయితే ఇక్కడ ధర్నాలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ స్టేట్‌మెంట్‌ తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గానికి ఆగ్రహం తెప్పించింది.తర్వాత కేటీఆర్‌ తప్పు తెలుసుకున్నారు. ఎన్టీఆర్‌ను తెగ పొగిడారు. తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. నిజానికి చంద్రబాబు అరెస్ట్‌ అంశం తెలంగాణలో కూడా చర్చనీయాంశం అవ్వాలి. కానీ ఇక్కడ ఎక్కడా అలాంటి వాతావరణం కనిపించడం లేదు.అసలు తెలంగాణలో ఉన్న సెటిలర్లు ఏమనుకుంటున్నారు? అసలు తెలంగాణ ఎన్నికలకు, బాబు రిలీజ్‌కు ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యూహమేమిటి? ఈ వీడియోలో చూద్దాం.

Updated On 1 Nov 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story