తెలుగుదేశంపార్టీ-భారతీయ జనతాపార్టీ(TDP BJP Alliance) కలయిక వెనుక ఏం జరిగింది? అసలు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఎందుకు వెంపర్లాడింది? ఈ ప్రశ్నలకు గత నెల రోజుల నుంచి ఎవరికి తోచినట్టు వారు సమాధానాలు చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని,

తెలుగుదేశంపార్టీ-భారతీయ జనతాపార్టీ(TDP BJP Alliance) కలయిక వెనుక ఏం జరిగింది? అసలు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఎందుకు వెంపర్లాడింది? ఈ ప్రశ్నలకు గత నెల రోజుల నుంచి ఎవరికి తోచినట్టు వారు సమాధానాలు చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆయనను అర్జెంట్‌గా గద్దె దింపాలని, లేకపోతే ఏపీ బాగుపడదని, ఈ కారణంతోనే తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని తెలుగుదేశం-జనసేనపార్టీలు యుగళగీతాన్ని ఆలపించాయి. రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం తమకు ఇష్టం లేకపోయినా బీజేపీతో కలవాల్సి వస్తున్నదని చెప్పుకొచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) చిలకూరిపేట సభలో దేశం కోసం మళ్లీ ఎన్డీయేకు ఓట్లు వేయమని అడిగారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు నాయుడు కూడా దేశం కోసం బీజేపీతో కలవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ మాత్రం వేరే లాజిక్కు చెబుతున్నారు. ఆయన చాలా నిజాయితీగా అసలు విషయాన్ని చెప్పారు. బీజేపీతో చంద్రబాబు కలవడం అన్నది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి కాదని, అరెస్ట్‌ల భయంతోనే చంద్రబాబు బీజేపీ శరణుజొచ్చారని రాధాకృష్ణ(Radhakrishna) స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అయితే టీడీపీవైపు బీజేపీ చూసే అవకాశమే లేదన్నారు. చంద్రబాబు(Chandrababu) బీజేపీతో చేతులు కలిపింది కేవలం అరెస్ట్‌ భయంతో మాత్రమేనని కుండబద్దలు కొట్టారు రాధాకృష్ణ. 'నరేంద్ర మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగినవారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద చంద్రబాబు సాగిలపడ్డారని నిందించి ప్రయోజనం ఏమిటి? ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కనుకే చంద్రబాబు రాజీపడిపోయారు' అని రాధాకృష్ణ తన కొత్త పలుకులో పలికారు. అంటే చంద్రబాబు కనుక బీజేపీతో కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళితే అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తారని రాధాకృష్ణ చెబుతూ అందుకే కేజ్రీవాల్‌ను ఎగ్జాంపుల్‌గా చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ధిక్కరించడం కంటే సాగిలపడిపోవడమే బెటరన్‌ చంద్రబాబు భావించారని చెప్పుకొచ్చారు. అంటే బీజేపీతో చంద్రబాబు చేతలు కలపడం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తేలిపోయింది. సాగిలపడకపోతే అరెస్ట్ అవుతామన్న భయం చంద్రబాబులో ఉంది. రాధాకృష్ణ ఏ ప్రయోజనాల కోసం తన కొత్తపలుకును రాస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం .. నరేంద్రమోదీ ఒక నియంత. అలాంటి నియంత రాజ్యమేలుతున్నప్పుడు అందరూ అడ్జెస్ట్ అవ్వాలి. ఎవరైనా ఎదురుతిరిగితే జైలుకు వెళతారు. కాబట్టి ఆయనకు ఎదురుతిరగకుండా సరెండర్‌ అవ్వడమే గొప్ప రాజనీతిజ్ఞత అని రాధాకృష్ణ రాశారు. మన పక్కనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Stalin) ఎప్పుడూ బీజేపీకి లొంగిపోలేదు కదా! దశాబ్దకాలంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) సారథ్యంలోని యూపీఏలో ఉంటూ వస్తున్నారు. ఆయనను కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా నెగ్గుకొని వస్తున్నారు. తనకు తెలియకుండా తన మంత్రిని గవర్నర్‌ భర్తరఫ్‌ చేస్తే కూడా మోదీకి స్టాలిన్‌ సాగిలపడలేదు. మమతా బెనర్జీ(Mamata Banerjee) కూడా అంతే! మమతా బెనర్జీలో ఫైటింగ్‌ స్పిరిట్‌ చచ్చిపోయిందని రాధాకృష్ణకు అనిపిస్తోంది కానీ దేశప్రజలకు అలా అనిపించడం లేదు.

Updated On 25 March 2024 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story