ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) బుధవారం టీవీ9కు(TV9) సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి సంబంధించి కాస్తో కూస్తో ఆందోళనలో ఉన్న నాయకులు గ్యారంటీగా ధైర్యం తెచ్చుకుని ఉంటారు. విజయంపై వారిలో విశ్వాసం ద్విగుణీకృతమై ఉంటుంది. ప్రధానంగా రెండు మూడు అంశాలలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఆ పార్టీకి చెందిన నేతలకు ధైర్యాన్ని ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) బుధవారం టీవీ9కు(TV9) సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి సంబంధించి కాస్తో కూస్తో ఆందోళనలో ఉన్న నాయకులు గ్యారంటీగా ధైర్యం తెచ్చుకుని ఉంటారు. విజయంపై వారిలో విశ్వాసం ద్విగుణీకృతమై ఉంటుంది. ప్రధానంగా రెండు మూడు అంశాలలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఆ పార్టీకి చెందిన నేతలకు ధైర్యాన్ని ఇచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల అంశంపైన కావొచ్చు, ల్యాండ్‌ టైట్లింగ్ అంశంపైన కావొచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో అసలు అభివృద్ధే లేదు అన్న విమర్శలపై కావొచ్చు, రాజధాని అంశంపైన కావొచ్చు, బీజేపీకి(BJP) సంబంధించిన విషయంపైన కావొచ్చు. జగన్మోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చే మాటలను వినాలనుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు క్లారిటీ దొరికింది. వై నాట్‌ 175 అన్నది కేవలం తమ స్లోగన్‌ కాదని, సైంటిఫిక్‌గా ప్రతి నియోజకవర్గంలో 70 నుంచి 80 శాతం వరకు ప్రజలకు తాము సంక్షేమం అందించామని, వారి నుంచి 50 శాతం ఓట్లను కోరుకోవడంలో తప్పు ఏముందని జగన్ చెప్పుకొచ్చారు. కుప్పం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు ప్రతీ గ్రామంలో తాము సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల గురించి చంద్రబాబునాయుడు ఎందుకు ప్రధాని నరేంద్రమోదీ(Pm Narendra modi) ముందు మాట్లాడలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, స్కూల్స్ ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా అని నిలదీశారు జగన్‌. జగన్‌ ఒక్కో విషయాన్ని క్లారిటీగా, జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్పుకొచ్చారు. ఇది చూస్తే వైసీపీ నేతలు ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లడంలో విఫలం చెందారేమోనని అనిపిస్తోంది. మూడు రాజధానుల విషయంపై కూడా జగన్‌ స్పష్టత నిచ్చారు. మొత్తంగా ఆ సుదీర్ఘ ఇంటర్వ్యూలో జగన్‌ మాట్లాడిన ప్రతి మాటలో ఆయన నిజాయితీ కనిపించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాననే నమ్మకాన్ని ప్రజలలో కల్పించారు జగన్‌. జగన్‌ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే ఏబీఎన్‌లో(ABN) చంద్రబాబు(chandrababu) ఇంటర్వ్యూ వచ్చింది. మొత్తం ఇంటర్వ్యూలో చంద్రబాబు తను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది చెప్పుకోకుండా జగన్‌ను తిట్టడమే కనిపించింది. జగన్‌ను నన్న చంపడానికి ప్రయత్నిస్తున్నడన్నారు. ఇది తప్పితే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లడలేదు. మానిఫెస్టోలో(Manifesto) పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారో చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు.

Updated On 9 May 2024 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story