ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Radha Krishna) తన వీకెండ్‌ కామెంట్ (Kotha Paluku)లో చాలా కొత్త కొత్త విషయాలు రాశారు. కొత్త ఎత్తుగడలు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) నిజామాబాద్‌లో మాట్లాడిన మాటలపై రాధాకృష్ణకు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి దగ్గరకు రకరకాల వ్యక్తులు వస్తారు.

ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Radha Krishna) తన వీకెండ్‌ కామెంట్ (Kotha Paluku)లో చాలా కొత్త కొత్త విషయాలు రాశారు. కొత్త ఎత్తుగడలు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) నిజామాబాద్‌లో మాట్లాడిన మాటలపై రాధాకృష్ణకు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి దగ్గరకు రకరకాల వ్యక్తులు వస్తారు. మాటా ముచ్చటలో పలు విషయాలను ఆయనతో పంచుకుంటారు. వాటన్నింటినీ బయటపెట్టడం నైతికత అనిపించుకోదు కదా అన్నది రాధాకృష్ణ వాదన. మోదీ పాత విషయాలను బయటపెట్టడం ద్వారా బీజేపీ(BJP), బీఆర్‌ఎస్‌(BRS) ఒక్కటేనని చెప్పినట్టయ్యిందని ఆర్కే భావన. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌(Minister KTR) గతంలో లక్ష్మణ్‌ తమతో పొత్తుకోసం అడిగారని, తాము వద్దన్నామని అన్నారు. నిజామాబాద్‌లో ప్రధాని మాట్లాడిన మాటలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఉభయ పార్టీలు కలిసి పని చేయడానికి ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోందని, దీన్ని బట్టి బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌ అని జనాలు నమ్ముతున్నారని ఆర్కే అంటున్నారు. ఇందులో ఒక్కశాతం కూడా కరెక్టనిపించడం లేదు.తన దగ్గరకు కేసీఆర్ వచ్చి మీతో కలిసి పని చేస్తామని, ఎన్డీయేలో భాగస్వాములమవుతామన, కేటీఆర్‌ను సీఎంను చేసి కేంద్రానికి తాను వచ్చేస్తానని అంటే, తాను తిరస్కరించానని మోదీ అంటున్నారు. అంటే కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగానే బీజేపీ దూరం పెట్టినప్పుడు ఆ పార్టీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌ ఎలా అవుతుంది? అలాగే లక్ష్మణ్‌ వచ్చి కలిసి పని చేద్దామని కేటీఆర్‌తో చెప్పినప్పుడు ఆయన కూడా కుదరదని చెప్పేసిన తర్వాత బీజేపీకి బీ టీమ్‌ ఎలా అవుతుంది? ఐడియాలజీలు దగ్గరగా ఉండి, కలిసి పని చేయాలని ఉభయులు అనుకుంటే కదా బీ టీమ్‌ అయ్యేది. ఇక్కడే ఆర్కే తప్పటడుగులు వేశారు. తన కొత్త పలుకులో రాధాకృష్ణ ఇంకా ఎలాంటి తర్కరహితమైన వ్యాఖ్యలు చేశారో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 9 Oct 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story