ABN Article On Chandrababu Release : చంద్రబాబు బయటకు రాడు, తేల్చేసిన ఆర్కే.
ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Radhakrishna) తన కొత్త పలుకును(Kotha Paluku) ఎప్పటిలాగే అసత్యాలతో నింపేశారు. ఆయన వీకెండ్ కామెంట్‌ను ఓ జర్నలిస్టులా కాకుండా తెలుగుదేశం కార్యకర్తగా రాస్తున్నారన్న విషయం మనకు తెలియంది కాదు. ఈ వారం కూడా ఆయన వ్యాసం తెలుగుదేశం పార్టీ కరపత్రంలాగే ఉంది. చంద్రబాబు(Chandrababu) కేసులో ఏమీ లేదని, అనవసరంగా ఆయనను అరెస్ట్ చేశారని రాధాకృష్ణ రాసుకొచ్చారు.

ABN Article On Chandrababu Release
ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Radhakrishna) తన కొత్త పలుకును(Kotha Paluku) ఎప్పటిలాగే అసత్యాలతో నింపేశారు. ఆయన వీకెండ్ కామెంట్‌ను ఓ జర్నలిస్టులా కాకుండా తెలుగుదేశం కార్యకర్తగా రాస్తున్నారన్న విషయం మనకు తెలియంది కాదు. ఈ వారం కూడా ఆయన వ్యాసం తెలుగుదేశం పార్టీ కరపత్రంలాగే ఉంది. చంద్రబాబు(Chandrababu) కేసులో ఏమీ లేదని, అనవసరంగా ఆయనను అరెస్ట్ చేశారని రాధాకృష్ణ రాసుకొచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేశారంటే న్యాయస్థానాలపైన కూడా అనుమానాలు వస్తున్నాయని రాధాకృష్ణ అంటున్నారు. న్యాయస్థానాల తీరుపైన ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. వై.ఎస్.అవినాష్‌రెడ్డిని(Avinash Reddy) ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఆయనకు ఎందుకు ఉపశమనాన్ని కలిగిస్తున్నారని రాధాకృష్ణ అడుగుతున్నారు. ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాలమ్‌లో రాధాకృష్ణ ఇంతకు ముందు ఏం రాశారంటే.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు, బెయిల్‌పై బయటకు వచ్చారు అని !మరి ఇప్పుడేమో అరెస్ట్ ఎందుకు చేయడం లేదని రాసుకొచ్చారు. తను రాసిందే తాను ఖండించుకోవడం ఏమిటో పాఠకులకు అర్థం కావడం లేదు. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య(YS Vivek Murder Case) కేసుపై రాధాకృష్ణకు ఎంతో ఆసక్తి ఉంది. ఆయన నెత్తిన పెట్టుకుంటున్న పార్టీకి ఇంకాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితోనే రాధాకృష్ణ బోలెడు సమాచారాన్ని సేకరించినట్టు ఉన్నారు. అసలు వివేకా హత్యకేసుకు సంబంధించిన సమాచారం రాధాకృష్ణ దగ్గరే ఎక్కువగా ఉంది. అందుకే సీబీఐ అధికారులు ఓసారి రాధాకృష్ణను కూడా విచారిస్తే కేసు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. తాడు బొంగరం లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని రాధాకృష్ణకు అనిపించవచ్చు కానీ జనానికి ఆ భావన లేదు. చంద్రబాబుపై కేసులు ఎన్ని ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఎన్నింటిపై ఆయన స్టేలు తెచ్చుకున్నారో కూడా తెలుసు. ఓ వ్యక్తికి కోర్టులు ఎంతకాలం స్టే ఇస్తుంది? 14 సంవత్సరాలుగా చంద్రబాబు స్టేలపై కొనసాగుతున్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలే రాలేదని జనానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణ. అసలు రాధాకృష్ణ కొత్త పలుకులో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం!
