ఆంధప్రదేశ్‌లో(Andhra Praesh) గత రెండు రోజుల నుంచి రాజకీయపార్టీలన్నీ ప్రజలకు డబ్బులు పంచుతున్నాయి. ఇందుకు సాక్ష్యాధారాలు ఏమున్నాయనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని చెబుతారు. తెలుగుదేశంపార్టీ(TDP) మాత్రం డబ్బుల పంపిణీలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీడీపీ అప్లై చేస్తోన్న ఈ స్ట్రాటజీ నిజానికి ఆ పార్టీకి చాలా ప్రమాదకరం.

ఆంధప్రదేశ్‌లో(Andhra Praesh) గత రెండు రోజుల నుంచి రాజకీయపార్టీలన్నీ ప్రజలకు డబ్బులు పంచుతున్నాయి. ఇందుకు సాక్ష్యాధారాలు ఏమున్నాయనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని చెబుతారు. తెలుగుదేశంపార్టీ(TDP) మాత్రం డబ్బుల పంపిణీలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీడీపీ అప్లై చేస్తోన్న ఈ స్ట్రాటజీ నిజానికి ఆ పార్టీకి చాలా ప్రమాదకరం. మరి ఎందుకు టీడీపీ దీన్ని అమలు చేస్తున్నదో అర్థం కావడం లేదు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలలో, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల వేళ జనాలకు డబ్బులు పంచడం అన్నది సర్వ సాధారణం. ఓటుకు డబ్బులు తీసుకున్నవారు బయటకు చెప్పరు. ఫలానా పార్టీవాళ్లు తమకు ఇంత ఇచ్చారని పది మందికి చెప్పుకోరు. ఓటుకు 500 రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది. నియోజకవర్గాన్ని బట్టి, పోటీ చేస్తున్న అభ్యర్థులను బట్టి ఓటు విలువ మారుతుంటుంది. నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే, కొన్ని పార్టీలు ఆ రెండు లక్షల మందికీ డబ్బులు ఇస్తాయి. కొన్ని పార్టీలు గ్యారంటీగా తమకు పడే ఓట్లను మినహాయించి మిగతావారికి ఇస్తాయి. ఏపీలో తెలుగుదేశంపార్టీ కొన్ని వర్గాలకు డబ్బులు ఇవ్వడం లేదు. మైనారిటీలకు, క్రిస్టియన్లకు, దళితులకు డబ్బులు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల ఎస్టీలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఎందుకంటే వీరంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) పార్టీ కోర్‌ ఓటు బ్యాంకుగా టీడీపీ గుర్తించింది. వీళ్లకు డబ్బులిచ్చినా మనకు ఓటు వేయరని టీడీపీ డిసైడయ్యంది. అనవసరంగా డబ్బులిచ్చి వేస్ట్ చేసుకోవడం కంటే ఈ డబ్బులను మరో చోట ఖర్చు పెట్టడం మంచిదనే నిర్ణయానికి టీడీపీ వచ్చింది.

Updated On 10 May 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story