ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Election) రోజున, ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై డీజీపీకి(DGP) సిట్‌ నివేదిక(SIT Report) ఇచ్చింది. హింసకు మీరంటే మీరు కారణమంటూ అధికార, విపక్షాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. ఆరోపించుకుంటున్నాయి. మొదటి రోజు అధికారపార్టీపైన పెద్ద ఎత్తున దాడులు చేశామంటూ ప్రతిపక్ష పార్టీ సెలబ్రెట్‌ చేసుకుంటోంది. ఆ తర్వాత అధికారపార్టీకి పోలీసులు సహకరించారు కాబట్టే తమపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయంటూ విపక్షం చెబుతోంది. రాజకీయపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ఏపీలో ఘర్షణలు జరియాన్నది నిజమని సిట్‌ దర్యాప్తు తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Election) రోజున, ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై డీజీపీకి(DGP) సిట్‌ నివేదిక(SIT Report) ఇచ్చింది. హింసకు మీరంటే మీరు కారణమంటూ అధికార, విపక్షాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. ఆరోపించుకుంటున్నాయి. మొదటి రోజు అధికారపార్టీపైన పెద్ద ఎత్తున దాడులు చేశామంటూ ప్రతిపక్ష పార్టీ సెలబ్రెట్‌ చేసుకుంటోంది. ఆ తర్వాత అధికారపార్టీకి పోలీసులు సహకరించారు కాబట్టే తమపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయంటూ విపక్షం చెబుతోంది. రాజకీయపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ఏపీలో ఘర్షణలు జరియాన్నది నిజమని సిట్‌ దర్యాప్తు తేల్చింది. గొడవలు చాలా తీవ్రస్థాయిలో జరిగాయని తేల్చింది. ఈ ఘర్షణలను నివారించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విషయాన్ని సిట్‌ తెలిపింది. ఈ ప్రాంతంలో గొడవలు జరగడానికి అవకాశం ఉందనే సమచారం ఉన్నప్పటికీ అక్కడకు బలగాలను పంపించడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యింది. ఆ గొడవలను నిరోధించడంలో కూడా ఫెయిలయ్యిందని సిట్‌ నివేదికలో తెలిపింది. అల్లరి మూకలు చెలరేగిపోతున్నా పోలీసు(Police) ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదని సిట్‌ అంటోంది.ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. గొడవలు జరిగిన తిరుపతి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల నుంచి నాయకులు ఈజీగా అక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్నవారిని కూడా పోలీసులు అక్కడి నుంచి బయటకు ఎలా పంపిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్కడ ఉద్దేశపూర్వకంగానే గొడవలు జరిగాయి. ఎన్నికల తర్వాత హింస కొనసాగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని సిట్‌ ఆరోపిస్తుంది. ఉన్నతాధికారులు విఫలం చెందారంటే దాని వెనుక ఉన్న కారణమేమిటి? మూడు జిల్లాలలో గొడవలు అయ్యాయి. ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కొత్తవారిని అక్కడ నియమించింది. ఎవరి ఫిర్యాదు మేరకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది? అంటే ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బదిలీ చేసింది. ఈ ముగ్గురు ఎస్పీలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనేది వార్త! ఇందులో నిజం ఉంది. సిట్‌ నివేదికలో ఇంకా ఏముందో ఇప్పుడు చూద్దాం.

Updated On 21 May 2024 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story