ఆంధ్రజ్యోతి(Andhrajyothy) సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Vemuri Radhakrishna)కు బిగ్‌ షాక్‌ తగిలిందనే చెప్పుకోవాలి. ఆయన చాలా కాలంగా, చాలా విస్తృతంగా, చాలా సీరియస్‌గా ఓ ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ షర్మిల(YS Sharmila)ను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP Politics)కి తీసుకెళ్లాలన్నది ఆయన ప్రయత్నం.

ఆంధ్రజ్యోతి(Andhrajyothy) సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ(Vemuri Radhakrishna)కు బిగ్‌ షాక్‌ తగిలిందనే చెప్పుకోవాలి. ఆయన చాలా కాలంగా, చాలా విస్తృతంగా, చాలా సీరియస్‌గా ఓ ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ షర్మిల(YS Sharmila)ను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో(AP Politics)కి తీసుకెళ్లాలన్నది ఆయన ప్రయత్నం. అవసరమైతే షర్మిలతో అక్కడ పార్టీ పెట్టించాలన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP)ని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షర్మిల నాయకత్వం వహించాలన్నది ఆయన కోరిక. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)కి వ్యతిరేకంగా షర్మిలతో ప్రచారం చేయించాలన్నది ఆయన ఆకాంక్ష. పనిలో పనిగా బ్రదర్‌ అనిల్‌కుమార్‌(Anil Kumar)తో కూడా జగన్‌ను తిట్టించాలని రాధాకృష్ణ తలపోశారు. జగన్‌ తల్లి విజయమ్మ(YS Vijayamma)తో కూడా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపేన్‌ చేయించాలని అనుకున్నారు.ఏపీ కాంగ్రెస్‌(AP Congress) బాధ్యతలను షర్మిల తీసుకోబోతున్నారంటూ కథనాలు కూడా రాశారు. దీనిపై పుంఖానుపుంఖానులుగా వార్తలు రాశారు. కానీ ఆయన ఎత్తుగడలు ఇప్పుడు ఫలించలేదు. ఆయన ఆశయాలను నీరుగార్చింది ఎవరో కాదు వైఎస్‌ షర్మిలనే! ఏ విధంగా రాధాకృష్ణకు షర్మిల చెక్‌ పెట్టారో, రాధాకృష్ణ అనుకున్నదానికి భిన్నంగా ఆమె ఎలా వ్యవహరించారో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 12 Oct 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story