ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi), నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan).. ఈ ముగ్గరూ కలిసి ఓ సభ పెట్టారు. దానికి ప్రజాగళం అని పేరు పెట్టారు. చిలకలూరిపేటలో(Chilakaluripet) జరిగిన ఈ సభకు భారీగా జనసమీకరణ చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఉద్దేశించి, మేము ముగ్గురం కలిసి ఉన్నాం. కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేయబోతున్నామనేది చెబుతారని చాలా మంది ఊహించారు. అలా ఊహించడంలో తప్పు కూడా లేదు. కానీ ఆ కూటమి సభ గందరగోళంగా తయారయ్యింది.

ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi), నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan).. ఈ ముగ్గరూ కలిసి ఓ సభ పెట్టారు. దానికి ప్రజాగళం అని పేరు పెట్టారు. చిలకలూరిపేటలో(Chilakaluripet) జరిగిన ఈ సభకు భారీగా జనసమీకరణ చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఉద్దేశించి, మేము ముగ్గురం కలిసి ఉన్నాం. కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేయబోతున్నామనేది చెబుతారని చాలా మంది ఊహించారు. అలా ఊహించడంలో తప్పు కూడా లేదు. కానీ ఆ కూటమి సభ గందరగోళంగా తయారయ్యింది. సభలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడిందేమిటో , చంద్రబాబునాయుడు ఏం చెప్పారో, మోదీ ఏం సెలవిచ్చారో ఆ మూడు పార్టీల కార్యకర్తలకు కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, ఆ కూటమి సభ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడులిద్దరూ వై.ఎస్‌.షర్మిలకు(YS Sharmila) సీఎం జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ ప్రధాని మోదీ మాత్రం షర్మిల, జగన్‌ ఒక్కటేనని వక్కాణించారు. సభ రసాభాస అయ్యిందన్నది అక్షర సత్యం. ఈ మధ్య కాలంలో ఇంత గందరగోళ సభను ఎవరూ చూసి ఉండరు. అదలా వదిలిపెడితే, తెలుగుదేశంపార్టీ అనుకూలమీడియా సభ ఫ్లాప్‌ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఏం చేయాలా అని బాగా ఆలోచించి తప్పంతా అధికారపార్టీ మీదకు నెట్టేస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే సభకు ఆటంకాలు సృష్టించారని పేజీలకొద్దీ వార్తలు రాసేస్తోంది. సభలో మైక్‌ పని చేయకుండా అధికారపార్టీ కుట్ర చేసిందని కన్నీరు ఒలకబోసింది. సభకు ప్రధాని వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ లాజిక్కులు తీస్తోంది. ఇంతకంటే ఆత్మవంచన ఏమన్నా ఉంటుందా? అసలు తెలుగుదేశంపార్టీని చూస్తే పాపమనిపిస్తోంది. టన్నుల కొద్దీ జాలి కలుగుతోంది. ఇలాంటి ప్రధాన మీడియాను పెట్టుకుని, ఇటువంటి మీడియాను నమ్ముకుని, ఇలాంటి పిచ్చి రాతలను చదివి ప్రజలు ఓట్లు వేస్తారనే భ్రమల్లో ఇంకా ఆ పార్టీ ఉంటే మాత్రం అటువంటి భ్రమల నుంచి వీలైనంత త్వరగా బయటకు రావడం మంచిది. ఎన్నిలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఇప్పుడైనా మీ చెంచా మీడియాను నోళ్లు మూసుకుని కూర్చొమని చెబితే మీకు నాలుగు ఓట్లు అయినా పడతాయి. ఇలాంటి రాతలు చదవి జనం నవ్వుకోకుండా ఎలా ఉంటారు? సిగ్గుండాలి కదా అలాంటి ప్రచారాలు చేయడానికి! సభ జరుగుతున్నంత సేపూ పోలీసులు ఆటంకాలు కలిగించారని ఎక్కడా చెప్పలేదు. మీటింగ్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎవరో వచ్చి మైక్‌సెట్‌ను డిస్ట్రబ్‌ చేస్తారా? ఈ రాతలు రాస్తున్నప్పుడు సిగ్గు, శరాలను పక్కన పెట్టేసుకుని ఉంటారు. మీరు నిర్వహించుకునే సభను సక్రమంగా సజావుగా జరుపుకునాల్సిన బాధ్యత మీకు ఉంటుందా? వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉంటుందా? ఓ పార్టీ సభ సరిగ్గా జరగకపోతే ఆ బాధ్యత ప్రభుత్వానికి అవుతుందా? ఎక్కడైనా ఉంటుందా ఇలా? గత ఆరు నెలలుగా టీడీపీ ఎన్నో సభలను నిర్వహించింది కదా! భవిష్యత్తు ఆశాకిరణంగా చెప్పుకుంటున్న లోకేశ్‌ కూడా పలు సభల్లో ప్రసంగించారు కదా! ఎక్కడైనా ఇలాంటి సాంకేతికసమస్యలు తలెత్తాయా? లేదే? సరే, మీరు చెబుతున్నట్టుగానే అధికారపార్టీనే వచ్చేసి మైకులు కట్‌ చేసిందే అనుకుందాం! మరి బోకేలు, శాలువాల సంగతేమిటి? అవి కూడా ఇవ్వకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆపేసిందా? ప్రధాని నరేంద్రమోదీకి బోకె, శాలువా ఇవ్వకుండా ఎవరు ఆపారు? ఇది కూడా జగన్‌ చేసిన పనేనా? ప్రజలు టవర్లు ఎక్కుతున్నప్పుడు కూడా పోలీసలు ఆపలేదట! ఇది ఇంకా జోకు! ఈ రాతలు రాసిన ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాలు పాత పేపర్లను ఓసారి తిరగేసి చూడండి.. ఇలా ప్రజలు టవర్లు ఎక్కి కూర్చున్న ఫోటోలు మీ పేపర్లలో చాలా కనిపిస్తాయి. పైగా ఆ ఫోటోల కింద మీరు రాసిన రైటప్‌లు కూడా ప్రజలకు ఇంకా గుర్తున్నాయ. చంద్రబాబు లేదా పవన్‌ కోసం ఎదురుచూస్తున్న జనం అంటూ చెత్త రాతలు! అప్పుడు మీకు ఇలా ప్రజలు టవర్లెక్కడం తప్పనిపించలేదు. ఇప్పుడు మాత్రం తప్పనిపిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

Updated On 19 March 2024 12:14 AM GMT
Ehatv

Ehatv

Next Story