Yellow Media Ignoring Pawan Kalyan Varahi Yatra : పవన్ గొంతు నొక్కేస్తున్న టీడీపీ మీడియా!
తెలుగుదేశం పార్టీ మీడియా(TDP Media) జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Pawan Kalyan) గొంతు నొక్కేస్తున్నదా? పవన్‌ను పక్కన పెట్టాలనుకుంటోందా? పవన్ మాటలు ప్రజలు వినకూడదని టీడీపీ మీడియా భావిస్తున్నదా? అసలు టీడీపీ మీడియా పవన్ పట్ల ఎందుకిలా వ్యవహరిస్తోంది? పెడన(Pedana)లో పవన్ సభ జరిగింది.
తెలుగుదేశం పార్టీ మీడియా(TDP Media) జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Pawan Kalyan) గొంతు నొక్కేస్తున్నదా? పవన్‌ను పక్కన పెట్టాలనుకుంటోందా? పవన్ మాటలు ప్రజలు వినకూడదని టీడీపీ మీడియా భావిస్తున్నదా? అసలు టీడీపీ మీడియా పవన్ పట్ల ఎందుకిలా వ్యవహరిస్తోంది? పెడన(Pedana)లో పవన్ సభ జరిగింది. పవన్ నాలుగో విడత వారాహి యాత్ర(Varahi Yatra4)) టీడీపీ-జనసేనలకు సంబంధించిన ఉమ్మడి యాత్రగా ఉంది. వారాహి యాత్రలో పాల్గొనండి అంటూ పార్టీ కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం ఆదేశించింది కూడా! ఇదలా ఉంచితే, తన యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) ప్రయత్నిస్తున్నదని పవన్ ఆరోపించారు. రెండువేల మంది సంఘ విద్రోహ శక్తులను పెడనకు తరలించారని, అల్లర్లకు కుట్ర చేస్తున్నారని అన్నారు. తనపైనా, తన కార్యకర్తలపైనా దాడికి దిగే అవకాశాలున్నాయని ఆరోపించారు. పవన్ ఈ మాటలన్న తర్వాత పెడనలో ఏం జరగబోతున్నదన్న ఉత్కంఠ పెరిగింది. పెడనలో పోలీసుల బందోబస్తు పెరిగింది. అల్లర్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద పెడన సభపై ఓ రకమైన ఆసక్తి పెరిగింది. పవన్ ఏం మాట్లాడతారన్న క్యూరియాసిటీ వచ్చింది.అలాంటిది పవన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ మీడియా అసలు పట్టించుకోలేదు. ఒక్కసారి కూడా పవన్ ప్రసంగాన్ని ప్రసారం చేయలేదు. మిగతా చానళ్లు అయితే సంబంధంలేని అంశాలపై చర్చలు పెట్టాయి. చిత్రమేమిటంటే అదే సమయంలో బాలకృష్ణ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్‌మీట్‌ను కూడా టీడీపీ మీడియా ప్రసారం చేయలేదు. పవన్ ముఖాన్ని దాచేయడం, బాలయ్యను పక్కన పెట్టడం వల్ల టీడీపీకి లాభమని ఆ మీడియా భావిస్తున్నది కాబోలు! టీడీపీ మీడియా ఎందుకు ఇలా చేస్తున్నదో ఈ వీడియోలో తెలుసుకుందాం!