నటుడు అలీ(Actor Ali) ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ కోసమే శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారికి పూర్తి సమయ కేటాయించడం సాధ్య పడదు. అలీ మాత్రం పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
నటుడు అలీ(Actor Ali) ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ కోసమే శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారికి పూర్తి సమయ కేటాయించడం సాధ్య పడదు. అలీ మాత్రం పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో ఒకటి అలీకి ఇస్తారని ప్రచారం జరిగింది. అలీకి ముఖ్యమంత్రి జగన్(Jagan) స్వయంగానే ఈ శుభవార్తను వినిపించారు. రేపో మాపో అధికారిక ప్రకటన రావచ్చునని అనుకున్నారు. ఏ పదవిని ఇవ్వాలనుకుంటున్నారో స్వయంగా జగనే తనతో చెప్పారని అలీ కూడా వివరించారు. అయితే అనూహ్యంగా రాజ్యసభకు ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలను పంపించాలని నిర్ణయం తీసుకుని ఆర్.కృష్ణయ్య(R Krishnaiah), బీద మస్తాన్ రావులకు(Masthan Rao) ఆ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత నిరంజన్‌రెడ్డిని రాజ్యసభకు(Niranjan Reddy) పంపించారు. విజయసాయిరెడ్డికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. దాంతో అప్పుడు అలీని రాజ్యసభకు పంపలేకపోయింది వైసీపీ. ఇక ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ మూడు స్థానాలలో ఒకస్థానాన్ని అలీకి ఇవ్వాలని వైసీపీ అనుకుంటోంది. నిజానికి అలీ అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. గుంటూరులో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దిగాలని అలీ భావించారు. అయితే గుంటూరులో కూడా అల్‌మోస్టాల్ అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు. అందుకే అలీని రాజ్యసభకు పంపవచ్చని చెబుతున్నారు వైసీపీ శ్రేణులు. అసలు అలీని రాజ్యసభకు పంపడం వెనుక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏమిటో ఈ ఎపిసోడ్‌లో చూద్దాం.