Why was Pawan Kalyan silent? || జనసేనాని మౌనవ్యూహానికి కారణమేంటి..? || Journalist YNR Analysis
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మౌనం పాటిస్తున్నారు.. ఏపీ(AP)లో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్నా వాటిపై స్పందించకుండా సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు.. చివరిసారిగా పార్టీ ఆవిర్భావ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన పవన్, ఆ తరువాత ఒక్క సమస్యపై కూడా సరిగ్గా స్పందించలేదు.. ఇంతకీ పవన్ మౌనం వెనుక రహస్యం దాగి ఉందా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మౌనం పాటిస్తున్నారు.. ఏపీ(AP)లో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్నా వాటిపై స్పందించకుండా సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు.. చివరిసారిగా పార్టీ ఆవిర్భావ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన పవన్, ఆ తరువాత ఒక్క సమస్యపై కూడా సరిగ్గా స్పందించలేదు.. ఇంతకీ పవన్ మౌనం వెనుక రహస్యం దాగి ఉందా... తరచూ ప్రభుత్వంపై విరుచుకుపడే పవన్ ఒక్కసారిగా సైలెంట్ ఎందుకయ్యారు అని జనసైనికులు నోర్లు కొరుక్కుంటున్నారు.
పవన్ రాబోయే ఎన్నికల కోసం ఆచితూచి అడుగులువేస్తున్నారు.. ఇటు పొత్తులు, పార్టీ బలోపేతంపై సైలెంట్ గా పని కానిస్తున్నారు... టీడీపీ(TDP)తో పొత్తు ఉంటుంది అంటూనే, జనసేనకు అధికారం కావాలి అంటూ అయన చేసిన వ్యాఖ్యలు జనసైనికులను అయోమయంలో పడవేస్తున్నాయి.. ఏది ఏమైనా ఈసారి వైసీపీ(YCP)ని గద్దె దించాలని పవన్ గట్టిగా పోరాడుతున్నారు... ఐతే పవన్ మౌనంగా ఉండటానికి ముఖ్యకారణం పొత్తులు అని తెలుస్తుంది.. పొత్తులులపై ఒక క్లారిటీ వచ్చాక జనంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని అయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.