Nimmagadda Ramesh kumar : నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పెన్షన్ల పంపిణీకి(Pensio Distribution) సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. దాంతో పాటు పెన్షన్‌దారులలో ఆందోళన కూడా నెలకొంది. ఇప్పుడు పెన్షన్‌లు తీసుకోవడం ఎలా? వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? ఇక ముందు ఇలాగే పెన్షన్ల కోసం క్యూలో నిల్చోవాల్సిందేనా? ఇలాంటి రకరకాల సందేహాలు ఏపీ ప్రజలకు వస్తున్నాయి. ఇది ఒకరిద్దరికి చెందిన సమస్య కాదు. దాదాపు 60 లక్షల మంది సమస్య కాబట్టే సీరియస్ అయ్యింది. ఇంతకాలం పెన్షన్ల పంపిణి బాధ్యతను వాలంటీర్లు తమ భుజాన వేసుకున్నారు. సమయానికి ఇంటి దగ్గరే పెన్షనర్లు డబ్బులు అందుకునేవారు. అయితే ఇప్పుడది ఆగిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పెన్షన్ల పంపిణీకి(Pensio Distribution) సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. దాంతో పాటు పెన్షన్‌దారులలో ఆందోళన కూడా నెలకొంది. ఇప్పుడు పెన్షన్‌లు తీసుకోవడం ఎలా? వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? ఇక ముందు ఇలాగే పెన్షన్ల కోసం క్యూలో నిల్చోవాల్సిందేనా? ఇలాంటి రకరకాల సందేహాలు ఏపీ ప్రజలకు వస్తున్నాయి. ఇది ఒకరిద్దరికి చెందిన సమస్య కాదు. దాదాపు 60 లక్షల మంది సమస్య కాబట్టే సీరియస్ అయ్యింది. ఇంతకాలం పెన్షన్ల పంపిణి బాధ్యతను వాలంటీర్లు తమ భుజాన వేసుకున్నారు. సమయానికి ఇంటి దగ్గరే పెన్షనర్లు డబ్బులు అందుకునేవారు. అయితే ఇప్పుడది ఆగిపోయింది. ఇలా పెన్షన్లు ఇంటిదగ్గరే అందుకునే వెసులుబాటు ఎందుకు ఆగిపోయింది? దాని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ. దీని వెనుక తెలుగుదేశంపార్టీ ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టే జగన్ ప్రభుత్వమే ఎన్నికల కమిషన్‌ను ఇన్‌ప్యూయెన్స్ చేసి పెన్షన్లను ఆపించిందన్నది టీడీపీ(TDP) ఎదురుదాడికి దిగుతోంది. ఈ ఆరోపణనే ఎన్నికల(AP ELections 2024) ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. నిజానికి ప్రభుత్వం దగ్గర పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవా? అంటే ఆ పరిస్థితి మాత్రం లేదని చెప్పొచ్చు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది. అయితే ఈ మొత్త ఎపిసోడ్ వెనుక ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. గతంలో ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్(Nimmagadda Ramesh kumar) ప్రభుత్వంతో కయ్యం పెట్టుకున్నారు. పెన్షన్ల విషయం ఇంత సంక్లిష్టం కావడానికి ఏకైక కారణం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. ఈయన ఆచూకి కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెతుకుతున్నారట! సిటజన్స్ ఫర్ డెమొక్రసీ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేసుకున్న నిమ్మగడ్డ రమేశ్ దానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తమను నట్టేట ముంచి ఎవరికీ కనిపించకుండా ఎక్కడకి వెళ్లారని టీడీపీ క్యాడర్ అనుకుంటోంది. ఇక నిమ్మగడ్డపై సోషల్ మీడియాలో(Social media) బోల్డన్ని సెటైర్లు వస్తున్నాయి. నిమ్మగడ్డ ఆచూకీ చెబతే తగిన పారితోషికాన్ని అందిస్తామని టీడీపీ పేరుతో క్రియేటివ్ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. నిమ్మగడ్డ చర్యలు తమకు లాభిస్తాయని చంద్రబాబు అనుకున్నారు. చంద్రబాబు సపోర్ట్‌తో నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ప్రతి నెలా ఒకటో తారీఖున పింఛన్లను అందిస్తున్న వాలంటీర్లపై వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. దీనికి రియక్టయిన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి వీలులేదని, ఆల్టర్‌నేట్ చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
దీంతో లబ్దిదారులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఇదేదో తమకు రాజకీయంగా నష్టం తెచ్చిపెట్టేట్టుగా ఉందని చంద్రబాబు ఆలస్యంగానైనా గ్రహించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం కలగడం లేదు. నిమ్మగడ్డతోనే విషయాన్ని చెప్పిద్దామనుకుంటే ఆయనేమో కనిపించడం లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వల్లే కోలుకోలేని విధంగా దెబ్బ తగిలిందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాపోతున్నారు. ఆయన ఆచూకీ చెబితే తగిన పారితోషికం ఇస్తామని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.