Kesineni Nani : కేశినేని నాని వ్యాఖ్యలు వెనక అసలు కారణమిదే
కేశినేని నాని(kesineni Nani) కృష్ణా జిల్లాలో(Krishna) బలమైన నాయకుడిగా ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి టీడీపీ(TDP) పార్టీ కి బలమైన స్థానం కలిపించారు. కేశినేని నాని ఇప్పుడు పార్టీ లో తూఫాన్ సృష్టిస్తున్నారు. మొన్నటి దాక పరోక్షంగా ఫైర్ అయ్యారు. పార్టీ అధినేతే తనని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. పార్టీ అధినేత నిర్లక్ష్యానికి అనేక కారణాలు ఉన్నాయ్ అన్నాడు కేశినేని నాని.
కేశినేని నాని(kesineni Nani) కృష్ణా జిల్లాలో(Krishna) బలమైన నాయకుడిగా ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి టీడీపీ(TDP) పార్టీ కి బలమైన స్థానం కలిపించారు. కేశినేని నాని ఇప్పుడు పార్టీ లో తూఫాన్ సృష్టిస్తున్నారు. మొన్నటి దాక పరోక్షంగా ఫైర్ అయ్యారు. పార్టీ అధినేతే తనని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. పార్టీ అధినేత నిర్లక్ష్యానికి అనేక కారణాలు ఉన్నాయ్ అన్నాడు కేశినేని నాని. ఈరోజు కేశినేని మాట్లాడిన దాని ప్రకారం తాను మల్లి పార్టీ లో గెలవడం ఆ జిల్లా నాయకులకి ఇష్టం లేదు అని చెప్పాడు.
విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు ఓడిపోయిన కూడా కేశినేని నాని మాత్రం 40వేల క్రాస్ వోటింగ్ జరిగి వైసీపీ(YCP) మీద విజయం సాధించారు.
అయితే కేశినేని నాని కి ఉన్న ఇమేజ్ చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది. చంద్రబాబు(chandrababu) కూడా కేశినేని నాని పట్ల వివక్షత చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఎంపీగా గెలిచిన తరువాత ఎంపీలకు సంబంధించిన పార్లమెంటరీ నాయకుడిగా ఆయనకు బదులు రామ్ మోహన్ రావు(Ram Mohan Rao) గారికి ఇచ్చారు. ఆ తర్వాత కూడా పార్టీ కి అనుకూలంగానే పని చేసారు.
మరి ఇంత చేసిన నాని ని పార్టీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది..? పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్ పార్టీ ఆఫీస్ నిర్మించుకొని పార్టీ సభ్యుడు కెశినేని నాని ని ఆహ్వానించకపోవడం ఏ మాత్రం భావ్యం...?
ఈ విషయాన్ని అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కేశినేని మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా ఐనా పోటీ చేస్తాను అని అన్నారు. పార్టీ లో ఇంకా అవమానాలు వివక్షలు తట్టుకోలెక్క తన పట్ల ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం నాని మొదలు పెట్టారు అని చెపుకోవచ్చు.