AP Volunteers : వాలంటీర్లను దేశ బహిష్కరణ చెయ్యాలా?
వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా రోజుకో వంటకాన్ని వండి వారుస్తోంది. తమ పెన్నులను నానా రకాలుగా తిప్పుతోంది. వాలంటీర్లను దేశం నుంచే బహిష్కరించాలన్నట్టుగా ఆ మీడియా కథనాలు ఉంటున్నాయి. వాలంటీర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నది మొదటి నుంచి టీడీపీ మీడియా చేస్తున్న ఆరోపణ.. ఇది ఆరోపణ కాదు దుష్ప్రచారం.
వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా రోజుకో వంటకాన్ని వండి వారుస్తోంది. తమ పెన్నులను నానా రకాలుగా తిప్పుతోంది. వాలంటీర్లను దేశం నుంచే బహిష్కరించాలన్నట్టుగా ఆ మీడియా కథనాలు ఉంటున్నాయి. వాలంటీర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నది మొదటి నుంచి టీడీపీ మీడియా చేస్తున్న ఆరోపణ.. ఇది ఆరోపణ కాదు దుష్ప్రచారం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రాత్రి పగలు అన్న తేడా లేకుండా తలుపులు కొడుతున్నారట! మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు ఉన్నారంటూ ఆ మధ్య పవన్ కల్యాణ్(Pawan kalyan) చెత్త వాగుడు వాగారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ నిమ్మగడ్డ రమేశ్‌తో ఓ పిటిషన్ వేయించింది తెలుగుదేశంపార్టీ. ఈ విధంగా వాలంటీర్లపై ప్రతి రోజూ విషం కక్కుతూ వచ్చిన టీడీపీ మీడియా చివరకు ఎంతకు తెగించిదంటే వాలంటీర్లను ప్రభుత్వం వేధిస్తున్నదని రాసింది. రెండింటికి ఏమైనా పొంతన ఉందా అసలు? ఒకట్రెండు చోట్ల వాలంటీర్లు ధర్నా చేస్తే దాన్ని హైలైట్ చేస్తూ వాలంటీర్లు ప్రభుత్వం తిరగబడ్డారు అంటూ కథనాలు ప్రచురించింది. నిజంగానే వారు ప్రభుత్వంపై తిరగబడితే అది తెలుగుదేశంపార్టీకి మంచిదే కదా! ఇప్పుడు మళ్లీ వాలంటీర్లపై విషం ఎందుకు కక్కుతున్నట్టు? వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని టీడీపీ మీడియా పోరాటం చేసింది. వారుంటే టీడీపీకి నష్టం అని భావించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ప్రభుత్వం కూడా వారిని విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు వారంతా వైఎస్‌ఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారన్నది టీడీపీ మీడియా చేస్తున్న అభియోగం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నారని అంటోంది. వారు ఉద్యోగులే కాదని రాసిన టీడీపీ మీడియా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారని రాస్తున్నది. ఒకదానితో ఒకటి సంబంధం ఉండనే ఉండదు. ఆరోజు ఏది తోస్తే అది రాసేయ్యడమే. ఆ రాతలో జగన్ ఆడిపోసుకోవడమే ఉంటుంది.