AP Pensions : పెన్షన్ ఆపింది మేమే! ప్రజలకు క్లారిటీ ఇచ్చేస్తున్న కూటమి
విపక్షాలు చేసిన కుట్రల కారణంగానే అవ్వతాతల పెన్షన్లు ఇంటి దగ్గరకు రావడం లేదన్న విషయం ప్రజలకు అర్థమయ్యింది. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు(Pensions) ఇవ్వడానికి వీల్లేదంటూ టీడీపీ(TDP) సానుభూతిపరుడు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్(Nimmagadda Ramesh kumar) ఎన్నికల సంఘానికి చెప్పడం, ఎన్నికల సంఘం కూడా రియాక్టయ్యి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడాన్ని నిరోధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులు చంద్రబాబును కోపంగా తిట్టుకుంటున్నారు. వారి మాటల్లో ఆవేదన కనిపిస్తుంది.
విపక్షాలు చేసిన కుట్రల కారణంగానే అవ్వతాతల పెన్షన్లు ఇంటి దగ్గరకు రావడం లేదన్న విషయం ప్రజలకు అర్థమయ్యింది. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు(Pensions) ఇవ్వడానికి వీల్లేదంటూ టీడీపీ(TDP) సానుభూతిపరుడు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్(Nimmagadda Ramesh kumar) ఎన్నికల సంఘానికి చెప్పడం, ఎన్నికల సంఘం కూడా రియాక్టయ్యి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడాన్ని నిరోధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులు చంద్రబాబును కోపంగా తిట్టుకుంటున్నారు. వారి మాటల్లో ఆవేదన కనిపిస్తుంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని అధికార పార్టీ ఓ అస్త్రంగా మార్చుకుంది. 56 నెలలుగా టైమ్‌కు టంచన్‌గా ఇంటి దగ్గర పెన్షన్లు అందుకుంటున్న లక్షలాది మంది పెన్షన్‌దారులు కూడా ఇప్పుడు పింఛన్‌ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో తిరుగుతున్నారు. ప్రభుత్వం పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని కౌంటర్ చేయలేక ప్రతిపక్షం పడరాని పాట్లు పడుతోంది. దీన్ని వ్యతిరేకించాలో, సమర్థించాలో తెలియక సతమతమవుతోంది. 60 లక్షల మంది పెన్షన్‌దారులకు దూరమయ్యామేమోన్న భయంతో తప్పుల మీద తప్పులు చేస్తూ వెళుతోంది. జగన్మోహన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పెన్షన్లు రాకుండా చేశారని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలో ఏ మాత్రం పస లేదని తేలిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి వివిధ టాక్స్‌ల రూపంలో రోజువారి ఆదాయమే చాలా ఉంటుంది. పెన్షన్లు కోసం ఇచ్చేది 700 కోట్ల రూపాయలు మాత్రమే! ఈ మాత్రం డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉండకుండా ఎలా ఉంటుంది? ఇది వర్క్ అవుట్ అవ్వకపోవడంతో చంద్రబాబు(Chandrababu) నాయుడు నేరుగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి ఎలాగోలా పెన్షన్లు ఇచ్చేయండి అని చెప్పారట! చంద్రబాబు ఎలా చెబుతారు? ప్రతిపక్ష నేత చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వగలరా? ఈ మ్యాటర్‌ను ముఖ్యమంత్రి చూసుకుంటున్నారు కదా! అంత అవసరమనిపిస్తే చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి ఓ రిప్రజంటేషన్ ఇవ్వవచ్చు. లేదా ఎన్నికల సంఘానికి లేఖ రాయవచ్చు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయం చూడమని టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పారంటూ అనుకూల మీడియా కథనాలు రాసింది. ప్రత్యామ్నాయ మార్గాలు చూడమంటూ ఎన్నికల సంఘం మొదటిరోజునే చెప్పింది. చంద్రబాబు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. సచివాలయం వరకు వృద్ధులు రావాల్సిన పరిస్థితికి కారణం తాము కాదని చెప్పడానికి ప్రతిపక్షం ఎన్నో తప్పులు చేస్తోంది. జనసేన అధినేత పవన్ కూడా లాజిక్కులేని మాటలు మాట్లాడుతున్నారు. తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను పెడుతున్నారు కదా! మరి వారితో పెన్షన్ ఇప్పించవచ్చు కదా అని పవన్ అంటున్నారు. పవన్ సినిమా ఎన్ని థియేటర్లలో వస్తుంది. మహా అయితే వెయ్యి అనుకుందాం! 60 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి వెయ్యి మంది సరిపోతారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అంతే! పెన్షన్‌లను బ్యాంకు అకౌంట్‌లో వేయాలట! బ్యాంకులో డబ్బులు వేస్తే వాటిని డ్రా చేసుకోవడానికి మళ్లీ బ్యాంకుల వరకు వెళ్లాలిగా? ఇలా విపక్షాలు తలాతోక లేని మాటలు మాట్లాడుతున్నాయి.