ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(Ramoji rao) ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామోజీ కడసారి చూపు కోసం ఫిల్మ్‌సిటీకి(Film City) వెళుతున్నారు ప్రముఖులు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలపుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగువారిపై రామోజీ ప్రభావం ఎంతగానో ఉంది. ఆయన రాసిన రాతల ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(Ramoji rao) ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామోజీ కడసారి చూపు కోసం ఫిల్మ్‌సిటీకి(Film City) వెళుతున్నారు ప్రముఖులు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలపుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగువారిపై రామోజీ ప్రభావం ఎంతగానో ఉంది. ఆయన రాసిన రాతల ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. చాలా మంది మన్ననలను పొందారు. అదే సమయంలో ఆయనకు శత్రువులు కూడా ఏర్పడ్డారు. కొన్ని వర్గాలు ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఓ పత్రికాధిపతికి ఇంత పెద్ద సంఖ్యలో శత్రువులు ఏర్పడటమన్నది రామోజీరావుతోనే ప్రారంభమయ్యిందని చెప్పాలి. అంతకు ముందు పత్రికా యజమానులపై ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉండేది. పత్రికాధిపతికి వ్యతిరేకంగా సినిమాలు రావడం, పత్రికాధిపతికి వ్యతిరేకంగా కొందరు రాజకీయనాయకులు మాట్లాడటం కూడా ఈయనతోనే మొదలయ్యి ఉంటుంది. రామోజీని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్(NTR) పెద్ద పెట్టున విమర్శలు చేసిన సంగతి మనం చూశాం. తర్వాత కొందరు రామోజీకి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశారు. తనపై వస్తున్న విమర్శలకు రామోజీరావు ఏనాడూ స్పందించలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. సారా వ్యతిరేక ఉద్యమంతో ప్రజలందరికీ దగ్గరయ్యారు. తెలుగుభాషకు సంబంధించి ఈనాడు చేసిన సేవను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈనాడులో పని చేసిన కొందరు జర్నలిస్టులు ఇప్పుడు రాజకీయనాయకులుగా ఎదిగారు. విమర్శలు ఎలా ఉన్నా ఈనాడు ఓ వ్యవస్థగా ఎదిగింది. రామోజీపై వ్యతిరేకత ఉన్నవారు ఉంటే ఉండొచ్చు. ఆయన భావజాలాన్ని తప్పుపట్టిన వారు కూడా ఉండొచ్చు. అయితే రామోజీ కన్నుమూసిన తర్వాత ఆయనపై నెగటివ్ ట్రోల్స్‌ను తప్పనిసరిగా ఖండించి తీరాల్సిందే. ఇది సరైంది కాదు. మరణించిన వ్యక్తుల మంచినే తల్చుకోవాలి. రామోజీలోనూ మంచినే చూడాలి. ఆయన సేవలను గుర్తు చేసుకోవాలి. వీలుంటే ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి. అంతేకానీ వ్యతిరేక కామెంట్లు చేయడం భావ్యం కాదు.