ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP High Court)లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(TDP Chandrababu Naidu)కు సంబంధించిన బెయిల్‌పై విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా కోర్టులో ఏం జరిగిందంటూ కొన్ని ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. న్యాయమూర్తి ఏమన్నారు? చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చెప్పారు?

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP High Court)లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(TDP Chandrababu Naidu)కు సంబంధించిన బెయిల్‌పై విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా కోర్టులో ఏం జరిగిందంటూ కొన్ని ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. న్యాయమూర్తి ఏమన్నారు? చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చెప్పారు? ప్రభుత్వం తరపు లాయర్లు ఏం మాట్లాడారు? వగైరా వగైరా. అదేదో ఎలెక్షన్‌ కౌంటింగ్‌లోలాగా మినిట్‌ టు మినిట్‌ ప్రసాదం చేశాయి. ఇలాంటివి ప్రసారం చేయడం టెలివిజన్‌ చానెళ్లకు కొత్తేమీ కాదు. ఈసారి మాత్రం కొన్ని ఛానెళ్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. తమకు అనుకూలమైన కథనాలను వండి ప్రసారం చేశాయి. కోర్టు లోపల జరిగింది ఇదేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. ప్రభుత్వ లాయర్లను జడ్జీలు చీల్చి చెండాడారు. న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ తరపు లాయర్లు జవాబివ్వలేకపోయారు. లాయర్లపై జడ్డీలు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ వర్గం మీడియా రాసింది. తిట్టారు, కొట్టారన్న పదాలు ఉపయోగించలేదు కానీ ఆ రకంగానే టీడీపీ మీడియా రాసుకొచ్చింది. చాలా సందర్భాలలో ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపు కేసును వాదించిన లాయర్లు కూడా ఇలాంటి కథనాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్‌కు టీడీపీ మీడియా రాస్తున్న కథనాలు ఆగ్రహాన్ని తెప్పించాయి. పచ్చి అబద్ధాలు రాస్తున్నాయని మండిపడ్డారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. దీనిపై కోర్టుకు వెళతానని అన్నారు. ఇంతకీ టీడీపీ మీడియా ఎలాంటి కథనాలను క్రియేట్‌ చేస్తున్నది? ఆ కథనాలపై పొన్నవోలు స్పందన ఏమిటి? ఈ వీడియోలో చూడండి.

Updated On 5 Oct 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story