ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP elections) ముగిశాయి. అందరిలోనూ ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. కొందరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అంటున్నారు. మరికొందరు కూటమికి(TDP Alliance) జై కొడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. జూన్‌ 4వ తేదీన జాతకం బయటపడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు(AP elections) ముగిశాయి. అందరిలోనూ ఓ రకమైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. కొందరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అంటున్నారు. మరికొందరు కూటమికి(TDP Alliance) జై కొడుతున్నారు. ఎవరెన్ని చెప్పిన నేతల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. జూన్‌ 4వ తేదీన జాతకం బయటపడుతుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. రాజకీయపార్టీలు కూడా ధీమాగానే ఉన్నాయి.ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బెట్టింగ్‌(Betting) రాయుళ్ల హడావుడి ఎక్కువయ్యింది. ఏ పార్టీ గెలుస్తుందన్నదానిపై పెద్ద ఎత్తున సొమ్ము కాస్తున్నారు. మన దేశంల బెట్టింగ్‌ అనేది అనైతికం! నిషిద్ధం కూడా! కానీ చాలా చోట్ల బెట్టింగ్‌ యాప్‌తో బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. రకరకాలుగా ఏపీలో బెట్టింగ్‌ నడుస్తోంది. జగన్‌ గెలుస్తారా? చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారా? వంటి వాటిపై భారీ ఎత్తున బెట్టింగ్‌ నడుస్తోంది.

Updated On 15 May 2024 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story