మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య(Harirama jogaiah) సలహాలు, సూచనలు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) నచ్చలేదు. తనకు సలహాలు ఇవ్వడమేమిటి? అంటూ మొన్నటి తాడేపల్లిగూడెంలో ఆగ్రహంతో ఊగిపోతూ పవన్ అన్నారు కూడా! 'మీ సలహాలు నాకు వద్దు. నాకు సలహాలు ఇవ్వడమేమిటి? నా విధానాలు నచ్చి వెంట నడిచే వాళ్లే నా వాళ్లు' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కాపు కురువృద్ధుడు జోగయ్యకు వార్నింగ్ ఇచ్చారు పవన్.
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య(Harirama jogaiah) సలహాలు, సూచనలు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) నచ్చలేదు. తనకు సలహాలు ఇవ్వడమేమిటి? అంటూ మొన్నటి తాడేపల్లిగూడెంలో ఆగ్రహంతో ఊగిపోతూ పవన్ అన్నారు కూడా! 'మీ సలహాలు నాకు వద్దు. నాకు సలహాలు ఇవ్వడమేమిటి? నా విధానాలు నచ్చి వెంట నడిచే వాళ్లే నా వాళ్లు' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కాపు కురువృద్ధుడు జోగయ్యకు వార్నింగ్ ఇచ్చారు పవన్. అదే రోజున మీ ఖర్మ అంటూ సోషల్ మీడియా వేదికగా చేగొండి హరిరామజోగయ్య అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఆయన మరో లేఖాస్త్రాన్ని జనసేనానికి సంధించారు. పవన్ శ్రేయోభిలాషిగా తన మద్దతు ఎప్పుడూ ఆయనకు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో నారా చంద్రబాబునాయుడు(Chandrababu), టీడీపీ(TDP) అనుకూల మీడియాపై కూడా కొన్ని విమర్శలు చేశారు. జోగయ్య రాసిన లేఖలో సారాంశమేమిటో ఇప్పుడు చూద్దాం. 'జనసేన బాగు కోసం ప్రత్యేకంగా మీ బాగు కోసం నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్టుగా లేవు. ఈ విషయం బహిరంగసభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్న ముఖ్యంగా మీకు, నాకు మధ్య తగువులు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేటట్లు చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ లేకుండా తెలుగుదేశంపార్టీ నెగ్గడం అసాధ్యం. ఆ మధ్యన చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేశ్ ప్రకటించినప్పుడు కానీ, మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చేయాలన్నా తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఆమోదం కావలసి ఉటుందని ఆయన చెప్పినప్పుడు కానీ జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు చల్లడానికి ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం మీ ఇంట్రెస్ట్‌తో చేశానా లేక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్‌తో చేశానా? 24 స్థానాలకు అంగీకరించడంపై జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతుంటే వారిని సముదాయించడానికి బహిరంగసభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ కాయటం అవుతుందా? జగన్‌పై సీబీఐ మోపిన అభియోగాలపై త్వరలో తీర్పును వెలువరింప చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వేసిన పిటిషన్ కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్‌గా పని చేస్తూనేనా? మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేనపార్టీలో చేరి మీకు నాతో పాటు 80 శాతంమంది కాపులు బీసీ,ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాజుబుల్. అది చంద్రబాబుకి తెలియనిది కాదు. అందుకే మీతో జతకట్టాడు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు? ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికులందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి? సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వైకాపా కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కాని, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కాని ఏమనాలి? వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా. మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిది. మీకు ఇష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నాను. నేను చచ్చేవరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను' అంటూ జోగయ్య ఓ సుదీర్ఘమైన లేఖ రాశాను. పవన్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా జోగయ్య మాత్రం లేఖలు రాయడం మానరని తెలుస్తోంది. తాజా లేఖలో చంద్రబాబు వెన్నుపోటుదారుడనే విషయాన్ని గుర్తు చేయడం గమనార్హం. చంద్రబాబుతో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడం విశేషం.