తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) పాదయాత్ర మొదలు పెట్టి 200 రోజులు గడిచాయి. 2700 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈ పాదయాత్ర గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా కూడా సాగింది. అయితే ఈ జిల్లాలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAS), ఎంపీలు పాల్గొనలేదు. టీడీపీకి మూడు లోక్‌సభ స్థానాలున్నాయి. కేశినేని నాని(Keshineni Nani), గల్లా జయదేవ్‌(Galla Jayadev), రామ్మోహన్‌ నాయుడు(TDP Ram Mohan Naidu) టీడీపీ నుంచి గెలిచిన వారే!

తెలుగుదేశం పార్టీ(TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) పాదయాత్ర మొదలు పెట్టి 200 రోజులు గడిచాయి. 2700 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈ పాదయాత్ర గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా కూడా సాగింది. అయితే ఈ జిల్లాలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAS), ఎంపీలు పాల్గొనలేదు. టీడీపీకి మూడు లోక్‌సభ స్థానాలున్నాయి. కేశినేని నాని(Keshineni Nani), గల్లా జయదేవ్‌(Galla Jayadev), రామ్మోహన్‌ నాయుడు(TDP Ram Mohan Naidu) టీడీపీ నుంచి గెలిచిన వారే! గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ కనిపించలేదు. కేశినేని నాని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లోకేశ్‌ తిరుగాడుతున్నప్పుడు ఆయన కూడా పార్టిసిపేట్‌ చేయలేదు. వారిద్దరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకో వారు లోకేశ్‌తో కలిసి అడుగులు వేయలేదు. వీరిద్దరు పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ఆయనతో వీరిద్దరు కలిసే ఉంటున్నారు. కానీ లోకేశ్‌ పాదయాత్రలో పార్టిసిపేట్‌ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. వీరే కాదు, మరి కొంత మంది నేతలు కూడా లోకేశ్‌ పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు. టీడీపీకి ఉన్న మరో లోక్‌సభ సభ్యుడు రామ్మోహన్‌ నాయుడు అనూహ్యంగా లోకేశ్‌ పాదయాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది?

Updated On 6 Sep 2023 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story