సినీ నటుడు, తెలుగుదేశంపార్టీ నేత, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బాధ్యతలను తాను తీసుకుంటానని, తెలంగాణలో తామేంటో చూపిస్తామని అన్నారు.

సినీ నటుడు, తెలుగుదేశంపార్టీ నేత, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బాధ్యతలను తాను తీసుకుంటానని, తెలంగాణలో తామేంటో చూపిస్తామని అన్నారు. తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, అందుకే ఇక్కడ కొందరు తన తండ్రి ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారని బాలయ్య చెప్పారు. ఈ వ్యాఖ్యలు మంత్రి కేటీఆర్‌(Minister KTR)ను ఉద్దేశించి చేసినవేనని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఖమ్మం పర్యటనలో ఎన్టీఆర్‌ను కేటీఆర్‌ కీర్తించారు. ఎన్టీఆర్‌ పేరులోనే ఓ వైబ్రేషన్‌ ఉందని అన్న విషయం తెలిసిందే. మళ్లీ బాలకృష్ణ విషయానికి వస్తే మంత్రి రోజా(Minister Roja)పై కూడా కామెంట్‌ చేశారాయన! రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురదలో రాయి వేస్తే మన మీదే పడుతుందని చెప్పారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest)పై సినిమావాళ్లు స్పందించకపోతే పట్టించుకోననని చెపపిన బాలయ్య.. జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) స్పందించకుంటే ఐ డోంట్‌ కేర్‌ అని కామెంట్‌ చేశారు. బాలయ్య ఇంకా ఏమన్నారో, జూనియర్‌ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 5 Oct 2023 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story