తెలంగాణ మంత్రి కేటీఆర్‌(Telangana Minister KTR) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల విషయంపై ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు చాలా సందర్భాలలో మాట్లాడాయి. ఆంధ్రా నుంచి పెట్టుబడులు తెలంగాణకు తరలివెళుతున్నాయంటూ ప్రతిపక్ష టీడీపీ తరచూ ఆరోపిస్తుంటుంది. ఇదే సమయంలో తెలంగాణలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ సర్కారు క్లైమ్‌ చేసుకుంటూ వస్తోంది.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌(Telangana Minister KTR) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల విషయంపై ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు చాలా సందర్భాలలో మాట్లాడాయి. ఆంధ్రా నుంచి పెట్టుబడులు తెలంగాణకు తరలివెళుతున్నాయంటూ ప్రతిపక్ష టీడీపీ తరచూ ఆరోపిస్తుంటుంది. ఇదే సమయంలో తెలంగాణలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ సర్కారు క్లైమ్‌ చేసుకుంటూ వస్తోంది. లేటెస్ట్‌గా వరంగల్‌లో ఒక ఐటీ సంస్థను ప్రారంభిస్తూ కేటీఆర్‌ కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి అంతా ద్వితీయశ్రేణి నగరాలలోనే ఉంటుందని కేటీఆర్‌ చెప్పారు. మహానగరాలు ఇప్పటికే కిటకిటలాడిపోతున్నాయని, కాబట్టి అభివృద్ధి ద్వితీయ శ్రేణి నగరాలకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. అందుకే తాము హైదరాబాద్‌ కాకుండా మిగతా జిల్లాల కేంద్రాలలో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వరంగల్‌లో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయని, నిజామాబాద్‌, ఖమ్మంలలో ఇప్పటికే ఐటీ హబ్‌ను ప్రారంభించామని కేటీఆర్‌ తెలిపారు. ఇటీవలే సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ‌రంగ‌ల్‌లోనే కాదు ఏపీలోని భీమ‌వ‌రం, నెల్లూరుకు కూడా ఐటీ సంస్థ‌లు రావాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు. అక్క‌డా ఐటీ సంస్థ‌ల‌ను పెట్టాల‌ని ఎన్నారైల‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భవిష్యత్‌లో గొప్ప ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఈ మేరకు క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ య‌జ‌మానుల‌కు కేటీఆర్ సూచించారు. కావాలంటే జ‌గ‌నన్న‌కు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను అని కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి..

Updated On 7 Oct 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story