జేపీ ఎందుకిలా? | Jaya Prakash Narayana Shocking Comments on CM Jagan & Governance
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) చౌదరి. ఈయనకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఈయన లోక్‌సత్తా అనే సంస్థను ఏర్పాటు చేసి, తదనంతర కాలంలో దాన్ని పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లో తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) చౌదరి. ఈయనకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఈయన లోక్‌సత్తా అనే సంస్థను ఏర్పాటు చేసి, తదనంతర కాలంలో దాన్ని పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లో తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తనకు తాను మేథావిగా ప్రమోట్ చేసుకుంటుంటారు. చిత్రమేమిటంటే ఆయనలాగే, ఆయన మాటలు కూడా సామాన్య జనానికి అర్థం కావు. ఇప్పుడు కూడా అంతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆయనపై సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆయన మాట్లాడిన అనేక వీడియోలను సోసల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు. అసలు జయప్రకాశ్ నారాయణ ఎందుకు ఇలా మాట్లాడారు? రాజకీయాలలో ఉన్న మురికిని లైజాల్‌తో కడిగేసి శుద్ధి చేద్దామనుకుని లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రజలు తన మాటలను నమ్మలేదు కాబట్టి రాజకీయ పోరాటం చేసి కూడా వేస్ట్ అని అనుకున్నారు. రాజకీయాల నుంచి నిష్ర్కమించారు. ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పని చేస్తూ ఉన్నారు. అలాంటి జయప్రకాశ్ నారాయణ సడన్‌గా ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా ఎందుకు మారారు? ఓ కూటమికి మద్దతు ఎందుకు ప్రకటించారు? దానికి ఆయన ఇచ్చుకుంటున్న రీజనింగ్ చిత్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసపు పాలన సాగుతోందని, చట్టబద్ద పాలన లేదని, భారీగా అప్పులు చేస్తున్నారని, కేవలం సంక్షేమం మాత్రమే చేస్తున్నారని, అభివృద్ధి అంశాన్ని విస్మరించారని చెబుతూ దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇవే అంశాలపై గతంలో జయప్రకాశ్ నారాయణ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం! అభివృద్ధి సంక్షేమం ఎప్పుడూ బ్యాలెన్సింగ్‌గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్‌పై నాలుగు మెచ్చుకోలు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వలె పరుగులు తీస్తున్నాయని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై పెదవి విరిచారు. ఈ హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యమని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థికవ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అంతే కానీ కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందనుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా అద్భుతంగా పని చేస్తున్నదని ఆయన నోటితోనే చెప్పారు. వికేంద్రీకరణ గొప్ప ఆలోచన అని కితాబిచ్చారు. ఇప్పుడేమో అమరావతి పేరుతో ధ్వంసం చేశారని విమర్శిస్తున్నారు. ఇంకా ఆయన ఏఏ అంశాలలో నాలుక మడతేశారో ఈ వీడియోలో చూడండి..