ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Elections) ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం(ELection Commission) వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఎన్నికలు సజావుగా జరగడం కోసం ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులను మార్చింది. ఇదంతా విపక్షమైన తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీల కూటమి ఫిర్యాదు చేయడం వల్లనే! కొంత మంది ఎస్పీలు అధికారపార్టీకి ఏజెంట్లలా పని చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూటమి. ఆ ఫిర్యాదు మేరకు అయిదు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఎన్నికల కమిషనర్‌ మార్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల(AP Elections) ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం(ELection Commission) వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఎన్నికలు సజావుగా జరగడం కోసం ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులను మార్చింది. ఇదంతా విపక్షమైన తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీల కూటమి ఫిర్యాదు చేయడం వల్లనే! కొంత మంది ఎస్పీలు అధికారపార్టీకి ఏజెంట్లలా పని చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూటమి. ఆ ఫిర్యాదు మేరకు అయిదు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఎన్నికల కమిషనర్‌ మార్చారు. నిజానికి ఎస్పీలను మార్చిన చోట ఎన్నికలు సజావుగా జరగాలి. కానీ ఎక్కడైతే ఎన్నికల కమిషన్‌ ఎస్పీలను మార్చిందో ఆ జిల్లాలోనే శాంతిభద్రతలు అదుపుతప్పాయి. అధికారపార్టీకి సంబంధించిన వారిపై విపక్షమైన తెలుగుదేశంపార్టీ గుండాలు దాడులు చేశారు. మిగతా చోట్ల అంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, ఎక్కడైతే ఎస్పీలను మార్చారో అక్కడే హింస చెలరేగడమేమిటి? అక్కడే శాంతిభద్రతలకు విఘాతం కలిగిందంటే అక్కడేదో కుట్ర జరిగినట్టు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు(Palnadu) ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పల్నాడు జిల్లా ఎస్పీని మార్చారు. తిరుపతిలో(Tirupati) గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి ఎస్పీని కూడా ఎన్నికలకు ముందు మార్చారు. అనంతపురంలో గొడవలు జరుగుతున్నాయి. అక్కడా అంతే. ఎస్పీని మార్చారు. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యల కారణంగా నిజానికి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. కానీ ఈసీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఘర్షణలు, గొడవలు జరగడమేమిటి? ఎన్నికల తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరిప్పుడు? తప్పంతా ఎన్నికల కమిషన్‌దే! ఎందుకు ఈ ఎస్పీలపై చర్యలు తీసుకోవడం లేదు? కేవలం విపక్షం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీలను మార్చినప్పుడు ఇంత హింస, గృహదహనాలు, దాడులు జరుగుతున్నప్పుడు ఎస్పీలపై ఎందుకు యాక్షన్‌ తీసుకోవడం లేదు? ఎన్నికల కమిషన్‌ ఎందుకు నిద్రపోతున్నది? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది? బాధితులు ఫోన్‌లు చేసి మొరపెట్టుకుంటున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్‌లు చేసినా జిల్లా ఎస్పీలు లిఫ్ట్‌ చేయడం లేదు. ఫోన్‌లు లిఫ్ట్‌ చేయవద్దంటూ వారికి ఆదేశాలు ఇచ్చిందెవరు? ఈ విషయం తెలియాల్సి ఉంది.

Updated On 15 May 2024 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story