తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu)కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తరచూ నోరుజారుతుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతీసారి ఆయన అనుంగు మీడియా వాటిని కప్పిపెట్టేస్తుంటుంది.

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu)కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తరచూ నోరుజారుతుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతీసారి ఆయన అనుంగు మీడియా వాటిని కప్పిపెట్టేస్తుంటుంది. మొన్నటిమొన్న ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌(Senior Journalist Rajdeep Sardesai)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్య సంచలనం రేపుతోంది. ప్రస్తుతం దేశ్యాప్తంగా రిజర్వేషన్ల రద్దు అంశంపై చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా కూడా దానిపై ఫోకస్‌ చేస్తోంది. దేశం మొత్తాన్ని ఎక్స్‌రే తీయాల్సి ఉంది. ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు? ఏ మతం వారు ఎంత మంది ఉన్నారు? దేశంలో వారికి అందవల్సిన భాగస్వామ్యం అందుతున్నదా? వంటివి తేలాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అంటున్నారు. అలాగే బీసీ జనగణనకు సంబంధించిన డిమాండ్‌ చాలా కాలంగా వస్తున్నది. బీసీ జనగణన కాదు, మొత్తం కులగణన జరగాలని రాహుల్‌గాంధీ చెబుతున్నారు. ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్‌. అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రకటించింది. దీనిపై బీజేపీ రకరకాల విమర్శలు చేస్తోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ఉన్నవి లేనివి కల్పించి చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంపదనంతా తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తుందని మాట్లాడుతున్నారు మోదీ(PM Modi)! ఓ ప్రధాన మంత్రి మాట్లాడే మాటలు కావు ఇవి! ఈ విషయాన్ని పక్కన పెడితే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్‌ అంటోంది. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే అన్నంత పని చేస్తుందన్నది కొందరి భయం! ఎందుకంటే బీజేపీ ఇంతకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేసింది కాబట్టి! కానీ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మాత్రం బీజేపీ అంతగా సాహసించదు. ఒకవేళ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఒప్పుకుంటే బీజేపీ పని చేయడానికి వెనుకాడదు. అయితే ఎన్టీయే కూటమిలో ఉన్న తెలుగుదేశంపార్టీ రిజర్వేషన్లపై గట్టిగా పోరాడవచ్చు. కానీ తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇలాంటి ఆలోచననే ఉండటం బాధిస్తోంది. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు చంద్రబాబు. కుల గణనకు బందులు స్కిల్‌ గణన చేయాలట! కులగణన సందర్భమేమిటి? చంద్రబాబు చెప్పినదేమిటి? ఏ మాత్రం సంబంధం ఉందా? దేశంలో నైపుణ్యం ఉన్నవారి చిట్టా తీస్తే అందులో ఎవరుంటారో తెలియని అమాయకులెవ్వరూ లేరిక్కడ! ఉద్యోగాలైనా, మరోటైనా నైపుణ్యం ఉన్నవారికే ఇవ్వాలని చంద్రబాబు ఉద్దేశం.

Updated On 3 May 2024 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story