ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) ముగిశాయి. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎన్ని సీట్లు గెలవబోతున్నది? కూటమి(TDP allaince) పరిస్థితి ఏమిటి? ఇలాంటి సందేహాలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. వీటిని కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ఈసారి అసెంబ్లీకి వస్తారా? రారా? అనే చర్చ కుప్పం సెంట్రిక్‌గా చాలా పెద్ద ఎత్తున జరగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) ముగిశాయి. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎన్ని సీట్లు గెలవబోతున్నది? కూటమి(TDP allaince) పరిస్థితి ఏమిటి? ఇలాంటి సందేహాలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. వీటిని కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ఈసారి అసెంబ్లీకి వస్తారా? రారా? అనే చర్చ కుప్పం సెంట్రిక్‌గా చాలా పెద్ద ఎత్తున జరగుతోంది. నిజానికి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 2009 ఎన్నికల నాటి నుంచి చాలా సందర్భాలలో చంద్రబాబుపై విజయం సాధించడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ కానివ్వండి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కానివ్వండి చంద్రబాబుపై పైచేయి సాధించడానికి వ్యూహరచనలు చేశాయి. కనీసం చంద్రబాబుకు వచ్చే మెజారిటీని తగ్గిస్తే లోక్‌సభ స్థానంలో విజయం సాధించవచ్చని అనుకుని ఆ విధమైన ప్రణాళికలను రచించుకునేవి! ఈ క్రమంలో కుప్పంపై ప్రత్యేక దృష్టిని పెట్టేవి. 2009లో అక్కడి నుంచి సుబ్రహ్మణ్య నాయుడిని చంద్రబాబుకు పోటీగా దింపింది కాంగ్రెస్‌. సుబ్రహ్మణ్య నాయుడుకు(subramanyam) నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నప్పటికీ చంద్రబాబును ఓడించలేకపోయారు. అయితే గత ఎన్నికలలో మాత్రం చంద్రబాబు మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సఫలీకృతురాలైంది. 35 వేలకు చంద్రబాబు మెజారిటీని తగ్గించగలిగిందంటే, ఆ 35 వేల మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన నిలిచారన్నమాటే! ఈసారి కుప్పంపై జగన్‌ చాలా కాన్‌సంట్రేట్‌ చేశారు. రెండేళ్ల నుంచే ఇందుకు ప్రణాళికలను రచించుకుంటూ వస్తున్నారు. కుప్పంపై(Kuppam) గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వై నాట్‌ కుప్పం(Why Not Kuppam) అనే స్లోగన్‌తో ముఖ్యమంత్రి జగన్ అక్కడికి వెళ్లి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆ నియోజకవర్గ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు. నియోజకవర్గంలో గెలుపు బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు. ఇదే సమయంలో కుప్పంకు ఒక రెవెన్యూ డివిజన్‌ను ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అన్నేళ్లపాటు ఉన్న చంద్రబాబు కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ ఇవ్వాలని ఏనాడూ అనుకోలేదు. చంద్రబాబు చేయని పనిని జగన్ చేశారంటూ కుప్పం ప్రజలు మాట్లాడుకోసాగారు. కుప్పంలో ఈసారి చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఓ బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపింది వైసీపీ. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీనే అత్యధిక స్థానాలను గెల్చుకుందక్కడ! ఓట్లు కూడా వైసీపీకే ఎక్కువ వచ్చాయి. ఇది ఎవరూ ఊహించలేదు. ఇలా జరగుతుందని అనుకోలేదు. తెలుగుదేశంపార్టీకి ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే! అక్కడి ఓటర్లకు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడాన్ని అలవాటు చేసింది వైసీపీ. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తూ వచ్చారు. అలాంటి వారు కూడా ఇప్పుడు ఫ్యాన్‌కు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కుప్పంలో టీడీపీ గెలుస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. కుప్పంలో తాము గెలవడం గన్‌షాట్‌ అని వైసీపీ నేతలు చెబుతున్నారు కానీ, ఇంత కాన్ఫిడెంట్‌గా టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. అసలు అక్కడ ఏం జరగబోతున్నది?

Updated On 18 May 2024 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story