ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) తెలుగుదేశంపార్టీ(TDP) సోషల్‌ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు(Chandrababu) ఎన్నికల సంఘం(ELection commission) నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) ఈసీకీ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ నోటీసులు పంపారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) తెలుగుదేశంపార్టీ(TDP) సోషల్‌ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు(Chandrababu) ఎన్నికల సంఘం(ELection commission) నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) ఈసీకీ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ నోటీసులు పంపారు. టీడీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీయే కూటమి సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయుసేన హెలికాఫ్టర్‌ను ఉపయోగించారంటూ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లేందుకు టెయిల్ నంబర్ 5236 గల ఐఏఎఫ్ హెలికాప్టర్‌ను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated On 19 March 2024 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story