AP Exist Polls 2024 : ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాట్ అవుతాయా?
మరికాసేపట్లో ఎగ్జిట్‌పోల్స్(Exist polls) వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదని, చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ తప్పు అయ్యాయంటూ రాజకీయ పార్టీలు ఆరోపించడం మనం చూశాం! ఎగ్జిట్ పోల్స్‌లో తమకు అనుకూల ఫలితాలు రాని పార్టీలన్నీ దాన్నితప్పుల తడకగా తిట్టిపోయడం కూడా చూశాం! అసలైన ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని వ్యాఖ్యానించడం మనకు అనుభవమే! అయితే 2019లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై, అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం! దాన్ని బట్టి ఈరోజు వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్‌లో ఏ సంస్థ చెప్పేది నిజానికి దగ్గరలో ఉంది? ఏది అసత్యాలతో కూడుకుని ఉన్నది అని అంచనా వేసుకోవచ్చు.
మరికాసేపట్లో ఎగ్జిట్‌పోల్స్(Exist polls) వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదని, చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ తప్పు అయ్యాయంటూ రాజకీయ పార్టీలు ఆరోపించడం మనం చూశాం! ఎగ్జిట్ పోల్స్‌లో తమకు అనుకూల ఫలితాలు రాని పార్టీలన్నీ దాన్నితప్పుల తడకగా తిట్టిపోయడం కూడా చూశాం! అసలైన ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని వ్యాఖ్యానించడం మనకు అనుభవమే! అయితే 2019లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై, అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం! దాన్ని బట్టి ఈరోజు వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్‌లో ఏ సంస్థ చెప్పేది నిజానికి దగ్గరలో ఉంది? ఏది అసత్యాలతో కూడుకుని ఉన్నది అని అంచనా వేసుకోవచ్చు. 2019 ఎన్నికలకు సంబంధించి రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సర్వే ఏదైనా ఉందంటే అది లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోలే! అప్పటి వరకు లగడపాటి సర్వేలకు ఓ క్రెడిబులిటి్ ఉండింది. లగడపాటి చెప్పారంటే జరిగి తీరుతుందన్న భావన చాలా మందిలో ఉండింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి ఇచ్చిన సర్వే దారుణంగా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికప్పుడు కూడా లగడపాటి ఇచ్చిన సర్వే ఢమాల్ అంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి(TDP) 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు వస్తాయని లగడపాటి చెప్పారు. అదే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 65 నుంచి 72 స్థానాల వరకు రావచ్చని అన్నారు. జనసేనకు(Janasena) ఒక స్థానం నుంచి మూడు స్థానాల వరకు రావచ్చని లగడపాటి తెలిపారు. కానీ ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. తెలుగుదేశంపార్టీకి కేవలం 23స్థానాలు మాత్రమే లభించాయి. జనసేనకు ఒక్కటే వచ్చింది. ఇక లోక్‌సభకు సంబంధించి లగడపాటి వేసిన ప్రిడక్షన్ ఎలా ఉందంటే తెలుగుదేశంపార్టీకి 15 నుంచి 17 లోక్‌సభ స్థానాలు వస్తాయన్నారు. పది నుంచి పన్నెండు లోక్‌సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వస్తాయన్నారు. ఇక్కడ కూడా లగడపాటి జోస్యం పని చేయలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు(YSRCP) 22 లోక్‌సభ స్థానాలు వచ్చాయి.
టీడీపీ కేవలం మూడు స్థానాలతో సంతృప్తి చెందింది. ఓట్ల శాతం విషయంలో కూడా లగడపాటి లెక్కలు తప్పాయి. ఇక సీపీఎక్స్ సర్వే ఏం చెప్పిందంటే టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు వస్తాయని, వైసీపీకి 130 నుంచి 133 స్థానాలు వస్తాయని తెలిపింది. జనసేనకు ఒక స్థానం వస్తుందని తెలిపింది. సిపీఎక్స్ వేసిన అంచనా ఫలితాలకు వాస్తవ ఫలితాలు కొంచెం దగ్గరగా ఉంది. ఇక వీడీపీ అసోసియేట్స్ కూడా ఎగ్జిట్ పోల్ సర్వే చేసింది. ఇందులో తెలుగుదేశంపార్టీకి 54 నుంచి 60 స్థానాలు వస్తాయిన చెప్పింది. వైసీపీకి 111 నుంచి 121 స్థానాలు వస్తాయని, ఇతరులకు నాలుగు స్థానాలు లభిస్తాయని చెప్పింది. ఇది కూడా కాస్త నమ్మబుల్‌గానే ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్టే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఆరా మస్తాన్ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సర్వే చేశారు. ఇప్పటి వరకు క్రెడిబులిటీ పోగొట్టుకోని సర్వే ఏదైనా ఉందంటే అది ఆరా మస్తాన్ సర్వేనే! 2019లో ఆరా సర్వే ఏం చెప్పిందంటే, తెలుగుదేశంపార్టీకి 47 స్థానాలు వస్తాయని, వైసీపీకి 126 నుంచి 135 స్థానాలు వస్తాయని పేర్కొంది. వాస్తవ ఫలితాలకు ఇది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. లోక్‌సభ ఫలితాలకు సంబంధించి కూడా ఆరా మస్తాన్ పర్‌ఫెక్ట్ ఫిగర్ చెప్పారు. 20 నుంచి 24 స్థానాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని, టీడీపీకి ఒకటి లేదా అయిదు స్థానాలు రావచ్చన్నారు. వైసీపీకి 22 స్థానాలు వస్తే టీడీపీకి మూడు స్థానాలు లభించాయి. ఇక మిషన్ చాణక్య ఏం చెప్పిందో చూద్దాం. వైసీపీకి 98 స్థానాలు, టీడీపీకి 58 స్థానాలు వస్తాయని చెప్పింది. జనసేనకు ఏడు స్థానాలు, ఇతరులకు ఒక స్థానం వస్తాయని చాణక్య తెలిపింది. ఇది కూడా కొంచెంద దగ్గరగానే ఉంది. మిగతా సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఏమిటి? వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం.