వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సుదీర్ఘ పాదయాత్ర తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవరకు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. నిజానికి జగన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి ముందు నుంచే ప్రజలలో ఉంటూ వచ్చారు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) బతికున్నకాలంలో జగన్ చాలా మందికి తెలియదు. పేరు మాత్రమే తెలుసు కానీ ఆయన ఎలా ఉంటారో పల్లె ప్రజలకు తెలియదు. పావురాలగుట్ట మీటింగ్ తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో, ఆ తర్వాత రకరకాల దీక్షలతో, ఆ తర్వాత పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సుదీర్ఘ పాదయాత్ర తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవరకు ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. నిజానికి జగన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి ముందు నుంచే ప్రజలలో ఉంటూ వచ్చారు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) బతికున్నకాలంలో జగన్ చాలా మందికి తెలియదు. పేరు మాత్రమే తెలుసు కానీ ఆయన ఎలా ఉంటారో పల్లె ప్రజలకు తెలియదు. పావురాలగుట్ట మీటింగ్ తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో, ఆ తర్వాత రకరకాల దీక్షలతో, ఆ తర్వాత పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల మనిషి అయ్యారు. 2009లో ప్రస్థానాన్ని మొదలు పెట్టిన జగన్ 2019లో లక్ష్యాన్ని చేరుకోగలిరు. దాదాపు పదేళ్ల పాటు నిరంతరరాయంగా ప్రజలలో ఉంటూ వచ్చారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో జగన్ పాల్గొంటూ వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం జగన్మోహన్‌రెడ్డి తనకు తానుగా ఒక గీత గీసుకుని లోపలే ఉండిపోయారా అనే అభిప్రాయం ప్రజలలో కలుగుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టే సమయంలో మాత్రమే జగన్ ప్రజల చెంతకు వస్తున్నారు. బహిరంగసభలలో ప్రసంగిస్తున్నారు. అసెంబ్లీలో కనిపిస్తున్నారు. క్రిస్మస్(Christmas) వేడుకల్లోనూ, ఇతర పండుగలప్పుడో కనిపిస్తున్నారు తప్ప నేరుగా ప్రజలను కలవలేకపోయారు. ఆయన ఒక్కసారి జనాల దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే జగన్ జిల్లా పర్యటనలకు వెళుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి పల్లె నిద్ర చేయబోతున్నారు. జిల్లాలన్నింటిలోనూ జగన్ పర్యటన ఉండబోతున్నది. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అన్న విషయాలను నేరుగా తెలుసుకోబోతున్నారు. ప్రజల్లోకి వచ్చి జగన్ ఏం చేయబోతున్నారు? అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి..