విజయవాడలో బృందావన కాలనీలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానంటూ ఓ విద్యార్థిని ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న మణికంఠ అనే వ్యక్తి వేధించసాగాడు.

విజయవాడ(Vijayawada)లో బృందావన కాలనీ(Rainbow Colony)లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానంటూ ఓ విద్యార్థిని ప్రైవేట్‌ టీచర్‌గా పనిచేస్తున్న మణికంఠ అనే వ్యక్తి వేధించసాగాడు. ఇది తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు మణికంఠను మందలించారు. దీంతో యువతి తండ్రిపై పగ పెంచుకున్న మణికంఠ అతనిపై కత్తితో దాడిచేసి చంపాడు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.

యువతి తండ్రిని చంపిన ఉన్మాది..వివరాల్లోకి వెళ్తే విద్యాధరపురానికి చెందిన కంకిపాటి శ్రీరామచంద్రప్రసాద్ విజయవాడ లబ్బీపేటలోని బృందావన్‌కాలనీలో కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని తిరిగి ఇంటికి చేరుకునేవాడు. వీరికి బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఓ కూతురు కూడా ఉంది. గత కొన్నినెలలుగా విద్యాధరపురానికే చెందిన మణికంఠ ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. ఇతను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. యువతిని వేధించే విషయం ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో మణికంఠను మందలించారు. యువతి తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు మణికంఠ. ఈ క్రమంలోనే రోజువారీ వ్యాపారం కోసం గురువారం కూడా కిరాణాషాపునకు శ్రీరామచంద్రప్రసాద్, ఆయన కూతురు వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసేసి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలోనే మణికంఠ కూడా షాపు వద్దకు వచ్చి తన వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీరామచంద్రప్రసాద్‌పై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమై శ్రీరామచంద్రప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story