ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌టంతో ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి.

ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌టంతో ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అలాగే కొత్త పార్టీలు కూడా పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీని ప్రకటించారు. ఆయ‌న జై భారత్ నేషనల్ పార్టీ(Jai Bharat National Party) పేరుతో రాజకీయ పార్టీ(Political Party)ని ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా(Special Status) తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. మేం ఓట్లు చీల్చం.. సీట్లు చీల్చి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామ‌న్నారు. సరైన పాలసీలు లేకపోవడం వల్లే ఉపాధి లభించడం లేదన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగనిచ్చే పథకం తీసుకువ‌స్తామ‌ని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి దిగలేదు.. దూకాను అని చమత్కరించారు.. మేం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం.. మా కాళ్ల మీదే మేం ఎదుగుతామన్నారు.

Updated On 22 Dec 2023 11:20 PM GMT
Yagnik

Yagnik

Next Story