ఏపీ ఎన్నికల్లో(AP Elections) విశాఖ నుంచే పోటీ చేస్తానని.. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ(CBI) మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) స్పష్టం చేశారు. బుధవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో(AP) బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.

జేడీ ఫౌండేషన్(JD Foundation), నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖలో మెగా జాబ్ మేళాను(Mega Job Mela) నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు(Job Fair) 50కు పైగా కంపెనీలు హాజ‌ర‌వుతున్నాయ‌ని.. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని తెలిపారు. వెనుకబడిన‌ అభ్యర్థుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని తెలిపారు.

Updated On 29 Nov 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story