JC Prabhakar Reddy About Ys jagan : మీ కంటే జగనే చాలా బెటర్: జేసీ ప్రభాకర్‌రెడ్డి రివర్స్ గేర్
జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు అనంతపురం జిల్లాలో దగ్ధం కావడం వివాదంగా మారింది.
జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు అనంతపురం జిల్లాలో దగ్ధం కావడం వివాదంగా మారింది. న్యూఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంపై బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవిలత సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, దానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత బస్సులు దగ్ధం కావడంపై ప్రభాకర్ రెడ్డి భగ్గుమన్నారు. జగన్ పాలన చాలా మేలని.. బస్సులు నిలబెట్టించాడు.. కానీ మీరు ఏకంగా తగలబెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులు నడపకుండా ఆపేశాడు అంతే తప్ప వాటిని ఏమీ చేయలేదని.. కానీ బీజేపీ వాళ్లు తన బస్సులు తగలబెట్టించారన్నారు. అయినా తాను వెనక్కి తగ్గేదిలేదన్నారు. తన వద్ద పనిచేసే డ్రైవర్లకు పాత బస్సులు తక్కువ ధరకు ఇచ్చేశానని, తనను నమ్ముకుని ఉన్న వాళ్ల కోసం ఏదైనా సాయం చేయాలని అనుకున్నానని ఆ బస్సులను తగులబెట్టారని ఆరోపించారు. తనపై విమర్శలు చేస్తున్న వారు హిందూ మతం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. తాను 650 ఏళ్ల నాటి శివాలయాన్ని రూ.20 కోట్లతో తిరిగి నిర్మిస్తున్నానని అన్నారు. అనంతపురంలో న్యూఇయర్ వేడకులు జరపొద్దనడానికి బీజేపీ నేతలకు హక్కు ఎవరిచ్చారన్నారు. ఆరేళ్లుగా బస్సులు నడపడం లేదని, చేతనమైతే పోలీసులు నిందితులను పట్టుకోవాలని సూచించారు. బస్సుల వ్యాపారంలో రూ.450కోట్ల కోల్పోయానని, బస్సులు దగ్ధమైతే తాను భయపడేది లేదన్నారు.