TDP-Janasena ఫ్లాప్ అయిన టీడీపీ–జనసేన తొలి బహిరంగ సభ
జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి
టీడీపీ–జనసేన తొలి బహిరంగ సభ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. టీడీపీ–జనసేన పొత్తుకు జనం మద్దతు ఎంతుందో తెలుసుకోవాలని భావించిన టీడీపీ–జనసేన కూటమికి ఊహించని షాక్ ఇచ్చారు జనం. కేడర్ నిరసనల్ని, మనోభావాల్ని లెక్కచేయకుండా చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిగత అజెండా తో నిర్వహించిన సభకు లక్ష మంది కూడా రాలేదని అంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలివస్తారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయగా.. అనుకున్నంత రెస్పాన్స్ లేదు. ప్రజలు పొత్తుకు బ్రహ్మరథం పడతారని చంద్రబాబు, పవన్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. టీడీపీ–జనసేన సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ జెండా సభకు ఏ మాత్రం జనం రాలేదు. ఆ సభకు హాజరైన వారి సంఖ్య చూసి ఆ పార్టీల అగ్ర నేతలు విస్తుపోయారు. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సగం పైగా కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో ఆ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్‌లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. వేదిక, హెలి ప్యాడ్‌లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌లు, పార్కింగ్‌కు ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీల చొప్పున 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు వేశారు. అయితే సభ ప్రారంభం నుంచి చివరిదాకా సగం గ్యాలరీలు ఖాళీగానే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 5.30 గంటలకు మొదలైంది. మొత్తం 22 గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రముఖులు, మీడియా, మహిళల కోసం ఆరు గ్యాలరీలు, మిగిలినవి కార్యకర్తలకు కేటాయించారు. సాయంత్రం 5 గంటలకు కూడా సగం గ్యాలరీలు నిండలేదు. లక్షల్లో వస్తారనుకుంటే ఇంత తక్కువగా రావడం టీడీపీ–జనసేన శ్రేణుల్ని ఆందోళన కలిగిస్తోంది.