Pawan Kalyan : తెలుగుదేశంపార్టీతో పవన్ బ్రేకప్!
జనసేన(Janaena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ వారంలో ఢిల్లీకి వెళ్లబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో(BJP) పొత్తులో పవన్ ఉన్నారు. ఎన్టీయే కూటమిలో కూడా జనసేన భాగస్వామి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీతో(TDP) పొత్తును స్వయంగా ఆయనే ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. సీట్ల సర్దుబాటు అంశంపైన కూడా చర్చిస్తున్నామని రెండు పార్టీల నాయకులు చెప్పారు.
జనసేన(Janaena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఈ వారంలో ఢిల్లీకి వెళ్లబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో(BJP) పొత్తులో పవన్ ఉన్నారు. ఎన్టీయే కూటమిలో కూడా జనసేన భాగస్వామి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీతో(TDP) పొత్తును స్వయంగా ఆయనే ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. సీట్ల సర్దుబాటు అంశంపైన కూడా చర్చిస్తున్నామని రెండు పార్టీల నాయకులు చెప్పారు. కానీ సీట్లకు సంబంధించిన విషయంపై క్లారిటీ రాలేదు. సంక్రాంతికి మొదటి లిస్టు విడుదల చేస్తామంటూ తెలుగుదేశంపార్టీ నుంచి ప్రకటన వచ్చినప్పటికీ, జనసేన, టీడీపీ కూటమికి చెందిన లిస్ట్ ఇప్పటి వరకు రాలేదు. అంతే కాదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది కూడా ఇంకా తేలలేదు. సమన్వయ కమిటీ సమావేశాల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా రా కదలిరా పేరుతో జనసేన-టీడీపీ కలిసి కార్యక్రమాలను నిర్వహిస్తామంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. కొన్ని జిల్లాలలో కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని చెప్పారు. ఇప్పటి వరకు పది పార్లమెంటరీ స్థానల పరిధిలోనే సమావేశాలు జరిగాయి. మిగతా చోట్ల సమావేశాలు జరుగుతాయో లేదో తెలియదు. ఈ నెల 29 వరకు అన్నిచోట్లా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు కానీ అది అయ్యేలా కనిపించడంలేదు. ఇంకా 15 చోట్ల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. జరిగిన పది సమావేశాలలో ఒక్క చోట కూడా పవన్ కల్యాణ్ హాజరవ్వలేదు. సో.. జనసేన-టీడీపీ కలిసి పని చేస్తున్న వాతావరణం కనిపించడం లేదు. అసలు రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది? టీడీపీతో పవన్ బ్రేకప్ చేసుకుంటారా? ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ వీడియోలో చూద్దాం.