Pawan Kalyan : రేపు తిరుపతికి పవన్ కల్యాణ్.. ఎస్పీని కలిసి ఆ ఘటనపై..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. శ్రీకాళహస్తి దాడి ఘటనపై తిరుపతి ఎస్పీని కలిసి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నాయకుడు కొట్టె సాయిపై చేయి చేసుకున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేయనున్నారు.

Janasena President Pawan Kalyan will Visit Tirupati On Monday
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Janasena Cheif Pawan Kalyan) సోమవారం తిరుపతి(Tirupati)కి వెళ్లనున్నారు. శ్రీకాళహస్తి(Srikalahasti)దాడి ఘటనపై తిరుపతి ఎస్పీ(Titupati SP)ని కలిసి సీఐ అంజూ యాదవ్(CI Anju Yadav)పై ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నాయకుడు కొట్టె సాయిపై చేయి చేసుకున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
తిరుపతి పర్యటన షెడ్యూల్.. సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు పవన్ రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport) చేరుకుంటారు. 10.30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నామని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఈ ప్రకటనలో తెలిపారు.
