Pawan Varahi Yatra : అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేపట్టిన వారాహి విజయయాత్ర నాలుగో విడత త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ యాత్రను అక్టోబర్ 1 నుంచి పవన్ ప్రారంభించనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు.

Pawan Varahi Yatra
మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ ఖరారు
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేపట్టిన వారాహి విజయయాత్ర నాలుగో విడత త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ యాత్రను అక్టోబర్ 1 నుంచి పవన్ ప్రారంభించనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాలుగో విడత యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో నాదెండ్ల మనోహర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
