జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌రిగిన‌ బహిరంగ సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయిందని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేనకు అధికారం ఇవ్వాలన్నారు. జనసేనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

జ‌న‌సేన(Janasena) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan) వారాహి విజయయాత్ర(Varahi Vijaya Yatra)లో భాగంగా కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pithapuram)లో జ‌రిగిన‌ బహిరంగ సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీ(YCP) ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయిందని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేనకు అధికారం ఇవ్వాలన్నారు. జనసేనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లననీ, మీరు నాకు సంపూర్ణ అధికారం ఇస్తే సీఎం(CM) పదవి చేపడతానని పేర్కొన్నారు. వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని మరో సారి అధికారంలోకి రానివ్వకూడదని అన్నారు. తనకు ఒక్క సారి అధికారం ఇవ్వాలని అభ్యర్ధించారు. తాము అధికారంలోకి వస్తే ముందుగా ముందుగా శాంతి భద్రతలపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్(MP Family Kidnap) చేసే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఈ కిడ్నాప్ అంశంలో డీజీపీ(DGP) మాటలు బాధకలిగిస్తున్నాయని పవన్ అన్నారు.

పిఠాపురాన్ని అథ్యాత్మిక రాజధాని(Spiritual Capital) గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో హిందూ దేవాలాయల(Hindu Temples) ధ్వంసం దారుణమని తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆలయాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తూ .. రాష్ట్రంలో 219 హిందూ ఆలయాల్లోనూ పిచ్చివాళ్లే ధ్వంసం చేశారా అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఒక్కరినీ పట్టుకోలేదని మండిపడ్డారు. ఆంధ్ర బాగుపడాలంటే మన కులపోడా, కాదా అన్నది చూడవద్దు.. మనకు సరైనోడా కాదా అన్నది చూడండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా పన్నుతానని అన్నారు.

సభలో అపశృతి

పవన్ కళ్యాణ్ మీటింగ్ లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు కార్య‌క‌ర్త‌లు చెట్టెక్కెడంతో ఆ చెట్టు కొమ్మలు ఒక్కసారిగా విరిగిపోయాయి. దీంతో వారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Updated On 16 Jun 2023 8:53 PM GMT
Yagnik

Yagnik

Next Story