2024 ఎన్నిక‌ల‌లోలో(Elections 2024) జనసేన(Janasena), టీడీపీ(TDP) కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబుతో(Chandrababu) ములాఖ‌త్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌లిసే పోటీ చేస్తామ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని వెళతామ‌ని పేర్కొన్నారు.

2024 ఎన్నిక‌ల‌లోలో(Elections 2024) జనసేన(Janasena), టీడీపీ(TDP) కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబుతో(Chandrababu) ములాఖ‌త్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌లిసే పోటీ చేస్తామ‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలను కూడా కలుపుకుని వెళతామ‌ని పేర్కొన్నారు. వైసీపీ(YCP) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న‌ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండావాలన్నదే త‌న‌ ఆకాంక్ష అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తాను ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఈ రోజే తాను నిర్ణ‌యం తీసుకున్నాని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జనసేన, టీడీపీ క‌లిసి వెళ‌తాయ‌ని నొక్కి చెప్పారు. ఈ నిర్ణ‌యం మా ఇద్ద‌రి భ‌విష్య‌త్ కు సంబంధించింది కాద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర భ‌విష్య‌త్‌కు సంబంధించింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆయ‌న అన్నారు. చంద్రబాబును రిమాండ్ కు తరలించడం బాధాకరమ‌న్నారు. 2014లో బిజెపి, టీడీపీ కి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనేన‌ని వివ‌రించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్లే గతంలో నేను చంద్రబాబుతో విభేదించానని తెలిపారు. వ్యక్తిగతంగా చంద్రబాబు సమర్థత నాకు తెలుసు అన్నారు.

జగన్ ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ దేశం వీడిపోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని.. అడుగడుగునా చట్టాలు ఉల్లంఘిస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఉందా? ఉపాధి అవకాశాలు వచ్చాయా? మద్యపాన నిషేధం జరిగిందా? సిపిఎస్ రద్దు చేశారా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించకూడదా? అని ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించారు.

వివేక హత్య కేసులో(Vivek Murder case) అన్ని వేళ్ళు జగన్(Jagan) వైపే చూపిస్తున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముంద్రాపోర్ట్‌లో హెరాయిన్ పట్టుకుంటే దాని మూలాలు ఏపీ లోనివేన‌న్నారు. అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. ఎవరు చట్టానికి అతీతులు కాదు.. చంద్రబాబుని రాజకీయ ప్రతీకారంతోనే అరెస్ట్ చేశార‌ని వ్యాఖ్యానించారు.

2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని నా అభిప్రాయం. నేను ఎన్డీయే లో ఉన్నాన‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. వైసీపీ దౌర్జన్యాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని.. అందుకోసం విడివిడిగా పోటీ చేస్తే కుదరదని అన్నారు. ఇన్నాళ్లు కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేవాణ్ణి. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయని స్ప‌ష్టం చేశారు.

Updated On 14 Sep 2023 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story