టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) ముగింపు సభను నిర్వహించనున్నారు. విజయనగరం(Vijayanagar) జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను(Public Meeting) భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) ముగింపు సభను నిర్వహించనున్నారు. విజయనగరం(Vijayanagar) జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను(Public Meeting) భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్(Pawan kalyan) విశాఖ(Vizag) చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఈ సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. బహిరంగ సభకు 110 ఎకరాల స్థలంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. స్టేజీ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు.. స్టేజీపై 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.